Krishna River: కృష్ణ నదికి భారీగా వరద నీరు.. జూరాల టూ శ్రీశైలం గేట్లు ఓపెన్

కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఆలమట్టి ఆనకట్ట నుంచి అధిక నీటి విడుదల కారణంగా ప్రియదర్శి జూరాలకు పెద్ద మొత్తంలో నీరు చేరుతోంది. 85 వేల క్యూసెక్కులు ఇన్ ఫ్లోతో శనివారం 7 గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు.

New Update
Krishna River

Krishna River: కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఆలమట్టి ఆనకట్ట నుంచి అధిక నీటి విడుదల కారణంగా ప్రియదర్శి జూరాలకు పెద్ద మొత్తంలో నీరు చేరుతోంది. 85 వేల క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉంది. దీంతో శనివారం 7 గేట్లు ఎత్తి 82వేల 250 క్యూసెక్కులు నీటిని కిందకి వదులుతున్నారు. 318.516. మీటర్ల పూర్తిస్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 317.570 మీటర్లు ఉంది. 7.773 టీఎంసీలు నీళ్లు ప్రాజెక్ట్‌లో ఉన్నాయి.

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

 Also Read :  ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం

ఇక శ్రీశైలం జలాశయానికి కూడా భారీగా వరద ప్రవాహం వస్తోంది. 81,944 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా.. గేట్లు ఇంకా ఎత్తలేదు. 885 అడుగులు పూర్తి స్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 851.40 అడుగులు మేరా నీరు ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు.

Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!

Advertisment
Advertisment
తాజా కథనాలు