BJP: బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక.. ఎప్పుడంటే ?
బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు రానున్నారు. మార్చి 20వ తేదీలోగా కమలం పార్టీకి నూతన అధ్యక్షుడు ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది. పార్టీకి సంబంధించి రాష్ట్ర విభాగాల్లో ఎన్నికలు పూర్తయిన వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.