EC: జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేకు ఈసీ షాక్..

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒకదానికొకటి ఈసీకి ఫిర్యాదులు చేశాయి. దీంతో ఈసీ జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసింది. నవంబర్ 18 మధ్నాహ్నం నాటికి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

New Update
nadda kharge

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార, విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నాయి.  ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌) ఉల్లంఘించారని బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఒకరినొకరు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు చేశారు. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన ఈసీ.. బీజేపీ నేత జేపీ నడ్డా, కాంగ్రెస్ నేత మల్లీకార్జున ఖర్గేకు వేరు వేరుగా లేఖలు పంపింది.  

Also Read: మహారాష్ట్ర ఎన్నికలు.. రాహుల్ గాంధీ బ్యాగ్ చెక్ చేసిన అధికారులు

ఇక వివరాల్లోకి వెళ్తే.. కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు తన ప్రసంగంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని బీజేపీ ఈసీకి ఇటీవలే ఫిర్యాదు చేసింది. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం తన ప్రసంగంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్‌ ఈసీని ఆశ్రయించింది. ఇలా ఫిర్యాదులు వచ్చిన క్రమంలోనే ఎన్నికల సంఘం ఇరు పార్టీల అగ్రనేతలకు లేఖలు రాసింది. నవంబర్ 18న మధ్నాహ్నం ఒంటిగంట కల్లా అధికారికంగా వివరణ ఇవ్వాలని  ఆదేశించింది.  

ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు 

ఇటీవల లోక్‌సభ ఎన్నికల సందర్భంగా స్టార్ క్యాంపెయినర్లకు చేసిన సూచనలను ఈసీ మారోసారి ప్రస్తావించింది. జాతీయ పార్టీల స్టార్ క్యంపెయినర్లు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని.. సమాజంలో సున్నితమైన కుర్పును పాడుచేయొద్దని సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈసీ సూచనలు చేసింది. మళ్లీ ఇప్పుడు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేసింది.

Also Read: మావోయిస్టుల కోసం గాలింపులు.. అమరవీరుల స్తూపాలు కూల్చివేత

Maharashtra - Jharkhand Elections

ఇదిలాఉండగా.. నవంబర్ 20న మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిదే. ఇప్పటికే ఝార్ఖండ్‌లో మొదటి దశ ఎన్నికలు ముగియగా.. నవంబర్ 20న మహారాష్ట్రతో పాటు రెండోదశ ఎన్నికలు ముగియనున్నాయి. మహారాష్ట్రంలో ఒకేదశలోనే నవంబర్‌ 20న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది. రెండు రాష్ట్రాల్లో ఈసారి ఎవరూ అధికారంలోకి వస్తరనేదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.   

ఇది కూడా చూడండి:  ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు