/rtv/media/media_files/2025/02/24/nLvaq6KMnRF5RpluYXNr.jpg)
BJP likely to get new national president by March 20
బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు రానున్నారు. మార్చి 20వ తేదీలోగా కమలం పార్టీకి నూతన అధ్యక్షుడు ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది. పార్టీకి సంబంధించి రాష్ట్ర విభాగాల్లో ఎన్నికలు పూర్తయిన వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలోనే ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగాల్సి ఉంది.
Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు
వచ్చే నెల 20వ తేదీలోగా బీజేపీ (BJP) కి నూతన జాతీయ అధ్యక్షుడు ఎన్నిక కానున్నారు. పార్టీ రాష్ట్ర విభాగాల్లో ఎన్నికలు పూర్తికాగానే జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించనున్నారు. జేపీ నడ్డా (JP Nadda) వారసుడిగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక జనవరిలో జరగాల్సి ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, బీజేపీ రాష్ట్ర విభాగాల ఎన్నికలు పెండింగ్‌లో ఉండటం కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. బీజేపీ నిబంధనల ప్రకారం సగానికి సగం రాష్ట్ర విభాగాలకు ఎన్నికలు జరగక ముందే జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించరాదు. ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చూసుకుంటే 12 చోట్ల మాత్రమే పార్టీకి సంబంధించి ఎన్నికలు జరిగాయి. రాబోయే మరికొన్ని వారాల్లో ఆరు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాతే పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.
Also Read: అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు తొలగింపు.. ఢిల్లీ అసెంబ్లీలో తొలిరోజు రచ్చ రచ్చ!
2020 జనవరి 20న పార్టీ 11వ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నికైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన పదవిలో కొనసాగుతున్నారు. నడ్డాకు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ పదవిలో కొనసాగారు. ఇక తొలిసారి బీజేపీ అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్‌పేయ్ 1980 నుంచి 1986 వరకు పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మరి బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.