RGV : ఎంత మాటన్నావ్ బ్రో... జాన్వీకపూర్ తో ఫీలింగ్స్ రావట్లేదట
జాన్వీకపూర్‌తో సినిమా చేసే ఉద్దేశం లేదన్నారు డైరెక్టర్ ఆర్జీవీ. శ్రీదేవిని దయచేసి ఎవరితో పోల్చవద్దని చెప్పాడు. తనకు శ్రీదేవి అంటే ఇష్టమని ఆమెతో సినిమా చేశాక చాలా మంది పెద్ద స్టార్స్, నటీనటులతో సినిమాలు చేసినప్పటికీ కనెక్ట్ అవ్వలేకపోయానని తెలిపారు.
హైదరాబాద్ లో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు.. వైరలవుతున్న ఫొటోలు
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా హైదరాబాద్‌లోని మధురానగర్ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి.
జాన్వీ కపూర్ ప్రాణానికి ప్రమాదకరంగా మారిన ‘దేవర’ సాంగ్.. వీడియో వైరల్
దేవర మూవీలోని చుట్టమల్లె సాంగ్ షూట్లో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొన్నట్లు జాన్వీ కపూర్ తెలిపింది. జెల్లీ ఫిష్‌లతో నిండిన నీటిలోకి దిగానని.. అది చాలా ప్రమాదకరంగా అనిపించిందని చెప్పింది. తనని ప్రొటెక్ట్ చేసుకునేందుకు సన్నని చీరతప్ప మరేమిలేదని తెలిపింది.
థియేటర్స్ లో 'దేవర' న్యూ వెర్షన్.. 'దావూదీ' సాంగ్ తో కొత్త సీన్స్ కూడా
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు 'దేవర' టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమాలో తొలగొంచిన 'దావుదీ' సాంగ్ ను థియేట్రికల్ వెర్షన్లో ఈ రోజు నుంచి జత చేయబోతున్నట్లు ప్రకటించింది.సెకండాఫ్ లో ఈ పాట వస్తుందని, పాటకు ముందు ఎన్టీఆర్, జాన్వీ మధ్య ఓ సీన్ కూడా యాడ్ చేసినట్లు సమాచారం.
'దేవర' ఊచకోత.. మూడో రోజు కలెక్షన్లు ఎంతంటే..!
ఎన్టీఆర్ 'దేవర' రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 243 కోట్ల వసూళ్ళు చేసింది. మూడో రోజు ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ. 40 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Devara : ఎన్టీఆర్ 'దేవర' సినిమాకు ఏపీ హైకోర్టు షాక్..!
ఎన్టీఆర్ 'దేవర' సినిమా విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 14 రోజుల వరకు టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఓ వ్యక్తి పిల్ దాఖలు చేయగా.. 10రోజులకే మాత్రమే పరిమితం చేయాలని హైకోర్టు ఆదేశించింది.
Devara : మమ్మల్ని క్షమించండి.. అభిమానులకు తారక్ సారీ!
‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసినందుకు అభిమానులను క్షమాపణలు కోరారు ఎన్టీఆర్. ఈ రోజుకోసం తాము ఎంతో ఆతృతగా ఎదరుచూశామన్నారు. కానీ ఫ్యాన్స్ భారీగా తరలిరావడంతో పరిస్థితి అదుపుతప్పుతుందని ముందస్తు జాగ్రత్తతో ఈ కఠిన నిర్ణయం తీసుకోకతప్పలేదన్నారు.
Janhvi Kapoor : తెలుగు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్న 'జానూ పాప' వీడియో..!
'దేవర' బ్యూటీ జాన్వీ తెలుగు అభిమానుల కోసం షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. తనను ఇంతగా అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలని.. తనను జానూ పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపింది.