Peddi Updates: ‘పెద్ది’ షూటింగ్ అప్‌డేట్.. యాక్షన్‌ సీన్స్ తో రఫ్ఫాడిస్తున్న రామ్ చరణ్‌

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా మౌలా అలీలో కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తి చేసుకుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ గ్రామీణ క్రీడా నేపథ్య చిత్రానికి ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

New Update
Peddi Updates

Peddi Updates

Peddi Updates: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా, బుచ్చిబాబు సానా(Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. ఇటీవల విడుదలైన ఫస్ట్ షాట్‌ వీడియోకి అభిమానులు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) కథానాయికగా నటిస్తోంది. 

Also Read: యాక్షన్ షురూ.. ఎన్టీఆర్‌ - నీల్‌ సెట్ లో అడుగుపెట్టనున్న యంగ్ టైగర్

త్వరలోనే కొత్త షెడ్యూల్‌

తాజాగా ఈ సినిమా సంబంధించి ఓ చిన్న షెడ్యూల్ మౌలా అలీ రైల్వే స్టేషన్‌లో పూర్తయింది. ఈ పార్ట్‌లో జగపతి బాబు, సత్య ల మధ్య వచ్చే  సన్నివేశాలు చిత్రికరించారు. అయితే ఈ షెడ్యూల్ లో కథకి చాలా ముఖ్యమైన సీన్లను  తెరకెక్కించనున్నారని సమాచారం. త్వరలోనే తదుపరి షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను చిత్రబృందం ప్రకటించే అవకాశం ఉంది.

Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..

గ్రామీణ క్రీడా నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్, జాన్వీ కపూర్‌తో పాటు శివరాజ్‌కుమార్, దివ్యేంద్ర శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఏ.ఆర్. రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతం అందించనుండడంతో మూవీపై హైప్ పెరిగిపోయింది.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

 

Advertisment
Advertisment
తాజా కథనాలు