Janhvi Kapoor: బాయ్ ఫ్రెండ్ తో జాన్వీ కపూర్ వీడియో వైరల్! ఎక్కడో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, శిఖర్ పహారియా మరోసారి కలిసి కనిపించారు. లండన్‌లో జరుగుతున్న వింబుల్డన్ 2025 టెన్నిస్ టోర్నమెంట్‌ సెమీ-ఫైనల్ మ్యాచ్ చూడడానికి వెళ్లారు.

New Update
Janhvi Kapoor with boyfriend Shikhar Pahariya

Janhvi Kapoor with boyfriend Shikhar Pahariya

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, శిఖర్ పహారియా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.  వీరిద్దరూ తరచు పలు ఈవెంట్లకు కలిసి హాజరవడం, తిరుమల దేవస్థానాన్ని కలిసి దర్శించుకోవడం ఈ వార్లకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే తాజాగా ఈ జంట మరోసారి కలిసి కనిపించారు. లండన్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 టెన్నిస్ టోర్నమెంట్‌ సెమీ-ఫైనల్ మ్యాచ్ చూడడానికి వెళ్లారు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ స్టైలిష్‌గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 

స్టైలిష్ గా కనిపించిన జంట 

జాన్వీ కపూర్ బ్లూ అండ్ వైట్ చెక్స్ డిజైన్ తో కూడిన ఫ్లోరల్ గౌన్ ధరించింది.  శిఖర్ పహారియా కూడా జాన్వీ  లుక్‌కు తగినట్లుగా బ్లూ సూట్,  లోపల వైట్ షర్ట్ తో పేరింగ్ చేసి  చాలా స్మార్ట్‌గా కనిపించారు. అభిమానులు కూడా వారిని చూసి "స్టైలిష్ జంట," "కపుల్ గోల్స్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ, శిఖర్ కలిసి పెద్ద ఈవెంట్‌లకు రావడం ఇదేం మొదటిసారి కాదు! వీరిద్దరూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ.. తరచు కలిసి కనిపించడం  మరింత ఊహాగానాలకు దారితీస్తోంది. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం జాన్వీ తెలుగులో రామ్ చరణ్ జోడీగా  'పెద్ది' సినిమాలో నటిస్తోంది. 'ఉప్పెన'  ఫేమ్  బుచ్చిబాబు సనా  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్స్ లో విడుదల కానుంది. దీంతో పాటు హిందీలో వరుణ్ ధావన్ తో కలిసి 'సన్నీ సంస్కారి కి తులసి కుమార్' అనే రొమాంటిక్ కామెడీలో నటిస్తోంది. అలాగే  సిద్ధార్థ్ మల్హోత్రా జోడీగా నటించిన 'పరం సుందరి' ఈనెల 25న విడుదల కానుంది. 

Also Read:Shilpa Shetty: అబ్బా! గ్రీన్ శారీలో ఫిదా చేస్తున్న శిల్పా.. ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!

Advertisment
తాజా కథనాలు