50 మంది అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. జనసేన నేత నిర్వాకం!?
ఏపీ ఏలూరులో జనసేన నేత 50 మంది అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయడం సంచలనం రేపుతోంది. తన బర్త్ డే సందర్భంగా నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామ శివారులోని ఓ మిల్లులో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు జనసేన మండల అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర. పోలీసులు దీనిపై విచారిస్తున్నారు.
Janasena: జనసేనలోకి మంచు మనోజ్, మౌనిక
మంచు మనోజ్, మౌనిక దంపతులు జనసేనలోకి చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన నంద్యాల స్థానం నుంచి వీరు తమ రాజకీయ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
జగన్కు బిగ్ షాక్.. జనసేనలోకి బొత్స
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ జనసేన పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ బయట బొత్స సత్యనారాయణను పవన్ కళ్యాణ్ నిన్న ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి బొత్స పార్టీ మారుతారని ప్రచారం కూడా సాగుతోంది.
AP Govt: చాగంటికి చంద్రబాబు సర్కార్ కీలక పదవి.. మరో 58 మందికి కూడా..!
ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితాను చంద్రబాబు సర్కార్ విడుదల చేసింది. మొత్తం 59 మందితో జాబితాను విడుదల చేసింది. రెండో జాబితా కార్పొరేషన్ పదవుల్లో టీడీపీ నుంచి 46 మంది, జనసేన నుంచి 10 మంది, బీజేపీ నుంచి ముగ్గురికి పదవులు దక్కాయి.
YCP-Jagan: జగన్కు దెబ్బ మీద దెబ్బ.. ఆ ఇద్దరు కీలక నేతలు జంప్!
YCP కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. TDP లేదా జనసేనలోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. నిన్న జరిగిన కృష్ణా జిల్లా YCP కీలక నేతల సమావేశానికి ఆయన హాజరుకాకపోవడంతో పార్టీ మార్పు కన్ఫామ్ అన్న చర్చ సాగుతోంది.
Pawan Kalyan: అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
AP: ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడవద్దని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ప్రతి దశలో పనుల నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
పవన్ స్కెచ్.. జగన్కు షాక్!
AP: వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేనలో చేరారు. ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. ఆమె వెంట గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు జనసేనలో చేరారు.