ఏపీలో కుల పిచ్చి.. అప్పటి వరకే టీడీపీతో.. పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్

తెలంగాణ వాళ్లకి తాము తెలంగాణ అనే భావం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్‌ వాళ్లకి కులాలు అనే భావన తప్ప, మేం ఆంధ్రులం అనే భావన లేదన్నారు పవన్ కళ్యాణ్. తమలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూటమిలో కలిసే ఉంటామని 15 ఏళ్ల పాటు కలిసే అధికారంలో ఉంటామని చెప్పుకొచ్చారు.  

New Update
pawan kalyan ap

ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లలో ప్రాంతీయ భావాలపై పవన్ మాట్లాడుతూ..  తెలంగాణ వాళ్లకి తాము తెలంగాణ అనే భావం ఉంటుంది కానీ..  ఆంధ్రప్రదేశ్‌ వాళ్లకి కులాలు అనే భావన తప్ప, మేం ఆంధ్రులం అనే భావన లేదన్నారు.  ఇది దురదృష్టమో, దౌర్భాగ్యమో తెలియదన్నారు.  వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రమే మాకు ఆంధ్రులం అనే భావన వస్తుందని పవన్ వ్యాఖ్యానించారు.  

ఇక అసెంబ్లీలో గవర్నర్ కు గౌరవం ఇవ్వని వైసీపీకి అడుగపెట్టడానికి వీల్లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదని, ప్రజలు వైసీపీకి ఆ అవకాశం ఇవ్వలేదని చెప్పారు. వాళ్లు ప్రతిపక్షంగా ఉండేందుకు ముఖం చాటేస్తున్న సందర్భంలో అధికార పక్షం, ప్రతిపక్షంగా తామే ఉంటామని పవన్ చెప్పుకొచ్చారు. తమలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కలిసే ఉంటామని, 15 ఏళ్ల పాటు కలిసే అధికారంలో ఉంటామని పవన్ కల్యాణ్ సభలో చెప్పుకొచ్చారు.  మేము ఒక్కటిగా ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసిన వాళ్లం అవుతామని అన్నారు.  

సీఎం చంద్రబాబుకు హ్యాట్సాఫ్‌

వైసీపీ తీరు చూస్తే పాలసీ టెర్రరిజం గుర్తుకువస్తుందని పవన్ విమర్శించారు. అసెంబ్లీలోనే వారి తీరు ఇలా ఉంటే బయట ఇంకెలా ఉంటారో  అని సందేహం వ్యక్తం చేశారు.. గవర్నర్‌  ప్రసంగాన్ని వైసీపీ బాయ్‌కాట్‌ చేయడం దురదృష్టకరమన్న పవన్..  వైసీపీ పార్టీని ఐదేళ్లు తట్టుకుని నిలబడిన సీఎం చంద్రబాబుకు హ్యాట్సాఫ్‌ అని తెలిపారు. ఎమ్మెల్యేలు అందరికీ ఆదర్శంగా ఉండాలన్న పవన్.. వైసీపీ నేతలు గొడవలు, బూతులకు పర్యాయపదాలుగా మారారని  చెప్పారు.  చట్టాలు చేయాల్సిన వాళ్లే నియమాలు ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు.  వైసీపీకి ప్రతిపక్ష  హోదా ప్రజలే ఇవ్వలేదని పవన్ చెప్పుకొచ్చారు.   వైసీపీ నేతల తీరుపట్ల తమ తప్పు లేకున్నా గవర్నర్ కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లుగా  వెల్లడించారు.

Also read :  కానిస్టేబుల్‌ కాదు కామాంధుడు.. రేప్ చేశాడని కేసు పెట్టాడానికి వెళ్తే  మళ్లీ రేప్ చేశాడు!

Also read :  ఢిల్లీ లిక్కర్ పాలసీలో కొత్త ట్విస్ట్.. కాగ్ సంచలన రిపోర్టు!

Advertisment
తాజా కథనాలు