Pawan-Balineni: జగన్‌కు షాక్.. పవన్‌కు అదిరిపోయే గిఫ్ట్.. బాలినేని మాస్టర్ స్కెచ్ ఇదే!

ప్రకాశం జడ్పీ చైర్మన్ పదవిని జనసేనకు దక్కేలా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా జనసేనకు తొలి జడ్పీ పీఠం అందించడంతో పాటు.. జిల్లాలో వైసీపీని దెబ్బకొట్టాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది.

New Update
Balineni Srinivas Reddy

Balineni Srinivas Reddy

వైసీపీకి మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో తన ఇమేజ్ పెంచుకోవడమే కాకుండా వైసీపీని దెబ్బ కొట్టడానికి ఆయన వ్యూహాలు రచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జడ్పీ పీఠంపై జనసేన జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ, కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేసిన బాలినేనికి ప్రకాశం జిల్లాపై మంచి పట్టు ఉంది. జిల్లాలోని వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు ఇప్పటికీ ఆయనకు టచ్ లోనే ఉన్నారు. దీంతో వారందరినీ వైసీపీ గూటికి చేర్చడానికి బాలినేని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జడ్పీ చైర్మన్ పదవి జనసేనకు లభించేలా ఆయన చక్రం తిప్పుతున్నట్లు జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. తద్వారా జిల్లా పాలిటిక్స్ లో తన పవర్ చూపించాలన్నది బాలినేని వ్యూహంగా తెలుస్తోంది. 
ఇది కూడా చదవండి: Kurnool Road Accident: APలో ఘోర రోడ్డు ప్రమాదం.. కుంభమేళా నుంచి వస్తుండగా బస్సు బోల్తా: 45 మంది ప్రయాణికులు!

మున్సిపల్ పై కూడా గురి..

జనసేనలోకి చేరేందుకు YCP ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ఈ రోజు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో తాడేపల్లి కార్యాలయంలో చేరికలు ఉంటాయన్న ప్రచారం సాగుతోంది. ఇందుకోసం ముందు రోజు రాత్రికే విజయవాడకు కొంత మంది కార్పొరేటర్లు చేరుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పలు దఫాలుగా ఒంగోలులోని బాలినేని నివాసంలోనే కార్పొరేటర్లు మంతనాలు జరిపినట్లు ప్రచారం సాగుతోంది. డిప్యూటీ మేయర్ తో సహా మరికొంత మంది కూడా YCPని వీడనున్నట్లు సమాచారం. 
ఇది కూడా చదవండి: TTD: తప్పు చేశా క్షమించండి.. దిగొచ్చిన టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్‌!

ఎమ్మెల్యే టికెట్ కోసమేనా?

గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమి తరఫున బరిలోకి దిగన దామరచర్ల జనార్దన్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత వైసీపీని వీడి బాలినేని జనసేనలో చేరారు. అయితే బాలినేని చేరికను జనార్దన్ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ పవన్ మాత్రం బాలినేనిని పార్టీలో చేరుకున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి టికెట్ దక్కించుకుని పోటీలో ఉండాలని బాలినేని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వైసీపీని ఖాళీ చేసి ఆ పార్టీ నేతలను జనసేనలో చేర్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా పవన్ కల్యాణ్ దగ్గర తన పట్టు పెంచుకోవాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు