/rtv/media/media_files/2025/03/01/K9D4IxAllgNFGnOR66Ie.jpg)
Nadendla Manohar
ఈ 14న పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ కీలక నేత రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సభ విజయవంతానికి కార్యకర్తలు అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం కాకినాడ కుళాయి చెరువు ఆవరణలోని కళాక్షేత్రంలో ఈ రోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 14న పిఠాపురం నియోజవర్గంలోని చిత్రాడలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: GV Reddy: చంద్రబాబు గ్రేట్.. బడ్జెట్ సూపర్.. రాజీనామా తర్వాత జీవీ రెడ్డి సంచలన ట్వీట్!
సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా పెద్ద సభ జరపాలి అంటే జనసమీకరణ పెద్ద సవాలు.
— JanaSena Shatagni (@JSPShatagniTeam) March 1, 2025
కానీ జనసేన పార్టీ అధినేత @PawanKalyan గారు వస్తున్నారు అంటే కనీసం 3 లక్షల నుండి 5 లక్షల వరకు జనం స్వచ్చందంగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు..#ChaloPithapuram#JanaSenaFormationDay pic.twitter.com/XVZuoQy3RS
పార్టీని బలోపేతం చేసే దిశగా సభ..
ప్రభుత్వంలో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ సభ ఉండబోతుందని వెల్లడించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. విశాల హృదయం ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆలోచన విధానాలను అనుసరించి ఈ సభను ప్రజాహితంగా నిర్వహిస్తామన్నారు. ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఒక పక్క ప్రభుత్వాన్ని ఐక్యం చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: Posani Arrest: పవన్‌ను అందుకే బూతులు తిట్టా.. పోసాని రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు!
ఈ మేరకు పార్టీ నిర్మాణంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు ఈ సభలో దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు. ఈనెల 14న పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ సభను నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉందన్నారు. అనంతరం పార్టీ సభ ఆవిర్భావ పత్రికను ఆవిష్కరించారు