/rtv/media/media_files/2025/03/14/n7QsPuSdDIEgmLHFA2eM.jpg)
Pawan Kalyan Powerful Speech At Janasena Formation Day Celebration
Pawan kalyan: జనసేన 12వ ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. 2014లో అన్ని ఒక్కడినై పార్టీని స్థాపించానని చెప్పారు. తనకు భయం అంటే ఏంటో తెలియదని, గుండె ధైర్యమే తన కవచం అన్నారు. భయం లేదు కాబట్టే 2019లో బరిలోకి దిగానని తెలిపారు.
ఓడినా అడుగు ముందుకే..
ఈ మేరకు 2019లో తాము ఓడినా ముందడుగే వేశామన్నారు. 'మనం నిలబడ్డాం నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. 2019లో ఓడిపోయినప్పుడు మీసాలు మెలేశారు.. జబ్బలు చరిచారు. మన ఆడపడుచుల్ని అవమానించారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఇదేం న్యాయం అని వీర మహిళలు అడిగితే కేసులు పెట్టి జైళ్లలో వేశారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని కూడా జైల్లో పెట్టారు. నన్ను అణచివేసేందుకు అనేక కుట్రలు చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని ఛాలెంజ్ చేశారు. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో, ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్‌లో అడుగు పెట్టాం. దేశమంతా మన వైపు చూసేలా 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం' అని చెప్పారు పవన్.
మనం నిలబడ్డాం, నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని నిలబెట్టాం - పవన్ కళ్యాణ్@PawanKalyan #AndhraPradesh #Pithapuram #JanaSena12thFormationDay #JanasenaParty #Pawanklayan #RTV pic.twitter.com/pYSKIuReJH
— RTV (@RTVnewsnetwork) March 14, 2025
Also Read : ఒప్పందం పై పుతిన్ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్!
గద్దరు అన్నలాంటివాడు..
ఏపీ అసెంబ్లీలో 21 ఎమ్మెల్యేలు, రెండు పార్లమెంట్ ఎంపీలతో అడుగుపెట్టాం. దేశమంతా తలతిప్పి చూసేలా 100 శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించాం. ఎన్డీయే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామని అన్నారు. ఇక గద్దరు తనకు అన్నాలాంటి వాడన్నారు పవన్. 463 మంది జన సైనికులు సిద్ధాంతం కోసం ప్రాణాలు ఇచ్చారని గుర్తు చేశారు. తాను సినిమాను దృష్టిలో పెట్టుకుని ఎదగలేదని, సమాజాన్ని, దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎదిగానన్నారు.ఇక దాశరథి చెప్పిన మాటలు తెలంగాణకే కాదు తనకు స్ఫూర్తిని ఇచ్చాయన్నారు. ఇప్పుడు, ఎప్పుడైనా నా మాట వినండి. సినిమా ప్రస్తావన వద్దు. ఓజీ ఓజీ అని అరవొద్దు అని ఫ్యాన్స్ కు సూచించారు. కార్యకర్తలు, ఫ్యాన్స్ కు ఐ లవ్ యూ చెప్పారు.
Also Read: పరాయి పురుషులతో శృంగారం ముచ్చట్లు.. ఆ కేసులో భార్యలకు షాక్ ఇచ్చిన హైకోర్టు!
2003లోనే రాజకీయాల్లోకి వెళ్తానని తన తల్లిదండ్రులకు చెప్పినట్లు పవన్ తెలిపారు. తమిళనాడులోనూ తనకు రాజకీయ అభిమానులున్నారని చెప్పారు. అంతేకాదు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లోనూ జనసేనకు కార్యకర్తలు, అభిమానులున్నారన్నారు. ఇక బహుభాషా దేశానికి మంచిదేనని, దానివల్ల దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. తమిళనాడు, కేరళకైనా ఒకే సిద్ధాంతం ఉండలన్నారు. తమిళులు తనపై చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు.