Pawan Vs Varma: పవన్ను ప్రశ్నిస్తూ.. షాకింగ్ వీడియో షేర్ చేసిన వర్మ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన X ఖాతాలో చేసిన పోస్టు తీవ్ర చర్చనీయాంశమైంది. పిఠాపురం జగ్గయ్య కాలనీలో పారిశుధ్యం లోపించిందని ఇందుకు సంబంధించిన వీడియోను వర్మ షేర్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే పవన్ ను టార్గెట్ చేసే ఆయన ఈ వీడియో షేర్ చేశారన్న చర్చ సాగుతోంది.