Kannada Actor Darshan : నిందితుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు!
అభిమాని హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు తెలుస్తుంది. ఆదివారం సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారగా.. తాజాగా ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో దర్శన్ తన స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.