తెలంగాణలో జైళ్ల ఖైదీలకు సంబంధించిన వార్షిక నివేదిక విడుదలైంది. జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా దీన్ని విడుదల చేశారు. గత ఏడాది మొత్తం 41,138 మంది ఖైదీలు జైల్లో ఉన్నారని తెలిపారు. హత్య కేసుల్లో 2,754 మంది ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. అలాగే 1,045 మంది ఖైదీలకు తాము ఉచిత న్యాయ సలహా సేవలు అందించామని పేర్కొన్నారు. " పోక్సో కేసుల్లో 3,655 మంది పురుషులు, 94 మంది మహిళలలు జైళ్లలో ఉన్నారు. Also Read: తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్.. మందుబాబులకు బిగ్ షాక్! నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్‌డీపీఎస్) కేసుల్లో 5,999 మంది పురుషులు ఉండగా.. 312 మంది మహిళలు శిక్ష అనుభవిస్తున్నారు. అలాగే 2024లో కోర్టు విచారణలో మొత్తం 30,153 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 483 మంది ఖైదీలను జైలు నుంచి విడుదల చేశాం. 303 మందికి పెరోల్ ఇచ్చాం. Also read: బాలయ్య హీరోయిన్ కు వేధింపులు.. 27మందిపై కేసు, పోలీసుల అదుపులో వ్యాపార వేత్త ఈ-ములాఖత్ ద్వారా ఖైదీలకు తమ కుటుంబీకులతో వీడియో కాల్ మాట్లాడే ఛాన్స్ ఇచ్చాం. 2,650 మంది ఖైదీలకు నైపుణ్య శిక్షణ ఇప్పించాం. 12,650 మందిని అక్షరాస్యులుగా తయారు చేశా. సినినటుడు అల్లుడు అర్జున్ విడుదలకు సంబంధించి కూడా జైళ్ల శాఖలో ఎలాంటి లోపం లేదు. చట్టం ప్రకారమే ఆయన్ని జైలు నుంచి విడుదల చేశామని'' డీసీ సౌమ్యా మిశ్రా వివరించారు. Also Read: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్.. పోలీసుల కీలక సూచనలు! Also Read: అలా చేయడం లైంగిక వేధింపుతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు