AAP: ఆప్ ఎమ్మెల్యేకు షాక్.. అపవిత్రం కేసులో రెండేళ్లు జైలు శిక్ష

ఖురాన్‌ను అపవిత్రం చేసినందుకు ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్‌కు పంజాబ్ కోర్టు రెండేళ్లు జైలు శిక్షతో పాటు రూ.10000 జరిమానా కూడా విధించింది. 2016లో మలేర్‌కోట్ల రోడ్లపై చిరిగిన ఖురాన్ పేజీలను వేసి హింసకు ప్రేరేపించినట్లు దోషిగా తేలడంతో కోర్టు శిక్ష విధించింది.

New Update
Naresh Yadav

ఖురాన్‌ను అపవిత్రం చేశారని ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్‌కు పంజాబ్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. అలాగే రూ.11000 జరిమానా కూడా కోర్టు విధించింది. 2016లో ఖురాన్‌ను అపవిత్రం చేశారని.. నరేష్ యాదవ్‌పై సెక్షన్ 295A ప్రకారం మత విశ్వాసాలను అవమానించడం, వారి భావాలను రెచ్చగొట్టడం153A,  ప్రకారం రెండు వర్గాల మధ్య గొడవలను ప్రేరేపించడం, 120B నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి: Fengal Cyclone : తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు

ఇది కూడా చూడండి: BIG BREAKING: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు..

హింసకు ప్రేరేపించారని..

నరేష్ యాదవ్‌ నిర్దోషి అని దిగువ కోర్టు 2021లో ప్రకటించింది. దీంతో ఓ వ్యక్తి కోర్టులో మళ్లీ అప్పీలు దాఖలు చేశాడు. దీంతో విచారించిన కోర్టు నరేష్ యాదవ్‌కు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. 2016లో మలేర్‌కోట్లలో రోడ్డుపై చిరిగిన ఖురాన్ పేపర్లు కనిపించాయి. దీని హింసకు దారితీసింది. కొందరు రోడ్డు మీదనే వాహనాలు దహనం చేశారు. హింసకు ప్రేరేపించే విధంగా చేసినందుకు నరేష్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.   

ఇది కూడా చూడండి: Adani: దాడులు మరింత బలాన్ని ఇస్తాయి..గౌతమ్ అదానీ

ఇది కూడా చూడండి: ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే..?

Advertisment
Advertisment
తాజా కథనాలు