YSRCP: సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఆ జిల్లాలకు అధ్యక్షుల నియామకం
వైసీపీ అధినేత వైఎస్ జగన్.. జిల్లా, నగర పార్టీ అధ్యక్షులను నియమించారు. అనంతపురం, సత్యసాయి, తూర్పు గోదావరి జిల్లాలకు అలాగే రాజమండ్రి నగరానికి పార్టీ అధ్యక్షులను నియమించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్.. జిల్లా, నగర పార్టీ అధ్యక్షులను నియమించారు. అనంతపురం, సత్యసాయి, తూర్పు గోదావరి జిల్లాలకు అలాగే రాజమండ్రి నగరానికి పార్టీ అధ్యక్షులను నియమించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటివరకు బలంగా ఉన్న వైసీపీ పరిస్థితి తల్లకిందులు అయిపోయింది. నేతలు ఒక్కొక్కరే కూటమిలోకి వెళ్ళిపోతున్నారు. దీంతో ఆ పార్టీ క్యాంపు పాలిటిక్స్కు తెర తీసింది.
AP: వైసీపీ చీఫ్ జగన్కు డబుల్ షాక్ తగిలింది. ఈరోజు వైసీపీకి ఇద్దరు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్రావు రాజీనామా చేయనున్నారు. ఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్ను కలిసి రాజీనామా లేఖను అందించనున్నారు. వచ్చే నెల 5 లేదా 6న లోకేష్ సమక్షంలో టీడీపీలో వారు చేరనున్నట్లు సమాచారం.
అనకాపల్లి ఆసుపత్రిలో ఫార్మా బాధితులను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శలు గుప్పించారు. ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు బాధకలిగిస్తోందన్నారు. కనీసం అంబులెన్స్ లను కూడా పంపించలేదన్నారు.
AP: ఈరోజు అచ్యుతాపురానికి వైసీపీ అధినేత జగన్ వెళ్లనున్నారు. ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను, గాయపడిన వారిని పరామర్శించనున్నారు. కాగా నిన్న సీఎం చంద్రబాబు అచ్యుతాపురం పేలుడు ఘటన బాధితులను పరామర్శించిన సంగతి తెలిసిందే.
AP: వైసీపీ అధినేత జగన్ రేపు అచ్యుతాపురానికి వెళ్లనున్నారు. ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను, గాయపడిన వారిని పరామర్శించనున్నారు. ఈరోజు సీఎం చంద్రబాబు అచ్యుతాపురానికి వెళ్లనున్న నేపథ్యంలో తన పర్యటనను రేపటికి వాయిదా వేసుకున్నారు జగన్
వైసీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి భారతీయుడి హృదయం నేడు గర్వంతో నిండే రోజు అని అన్నారు.
AP: ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండో రోజు ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిశానిర్ధేశం చేయనున్నారు. కాగా తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును వైసీపీ ప్రకటించగా.. కూటమి ఇంకా ప్రకటించలేదు.
కూటమి ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా దాడులు చేస్తోందని మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని.. ఇంత జరుగుతుంటే సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీ దాడులకు ప్రజలు భయపడిపోతున్నారన్నారు.