/rtv/media/media_files/2026/02/28/pakistan-afghanistan-war-2026-02-28-11-18-54.jpg)
Pakistan-Afghanistan war
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య భీకర దాడులు(pakistan afghanistan war) కొనసాగున్నాయి. తాము చేసిన దాడుల్లో ఇప్పటిదాకా 274 మంది తాలిబన్లు చనిపోయారని.. మరో 400 మంది గాయపడ్డారని పాకిస్థాన్ తెలిపింది. మరోవైపు తాము 55 మంది పాక్ సైనికులకు హతమార్చామని అఫ్గానిస్థాన్ చెబుతోంది. కానీ ఈ లెక్కల్లో గందరగోళం ఏర్పడింది. ఈ దాడుల్లో తమ సైనికులు 12 మంది చనిపోయారని పాకిస్థాన్ అంటోంది. తమవారు 13 మందే ప్రాణాలు కోల్పోయారని అఫ్గానిస్థాన్ చెబుతోంది. అఫ్గానిస్థాన్‌తో తాము బహిరంగ యుద్ధంలో ఉన్నట్లు శుక్రవారం పాకిస్థాన్ చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read: భారత పార్లమెంట్‌కు తొలిసారి LGBTQ మహిళ.. ఎవరీ మేనకా గురుస్వామి ?
Pakistan-Afghanistan Updates
ఫిబ్రవరి 22న అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది. ఇందులో 70 మంది ముష్కరులను హతమార్చినట్లు పేర్కొంది. దీనికి ప్రతీకారంగా గురువారం అఫ్గానిస్థాన్ పాక్ సరిహద్దుల్లో దాడులకు పాల్పడింది. గురువారం అర్దరాత్రి దాటాక అఫ్గాన్‌లోని కాబుల్, కాందహార్, పక్తియా ప్రావిన్సులపై పాక్ కూడా వైమానిక దాడులతో విరుచుకుపడింది.
అఫ్గానిస్థాన్‌తో బహిరంగ యుద్ధమేనని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఎక్స్‌లో తెలిపారు. మేము దూకుడుగా ముందుకెళ్తామన్నారు. తాలబన్ల బలాలు, బలహీనతలు తమకు తెలుసని నాటో బలగాల ఉపసంహరణ తర్వాత అఫ్గాన్‌లో శాంతి వస్తుందని భావిస్తున్నామని చెప్పారు. తాలిబన్లు అఫ్గాన్ భారత వలస రాజ్యంగా మార్చేశారంటూ నోరుపారేసుకున్నారు. అఫ్గాన్ ప్రజలకు వారు కనీస మానవ హక్కులు కూడా కల్పించడం లేదన్నారు. మరోవైపు పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ కూడా దీనిపై స్పందించారు. అఫ్గాన్‌కు చెందిన 73 పోస్టులను తాము ధ్వంసం చేశామన్నారు. మరో 18 పోస్టులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తాలిబన్ల దాడుల్లో కేవలం 12 మంది పాక్ సైనికులే మరణించారని చెప్పారు.
Also Read: అమెరికాకు వెళ్లమంటున్న భారతీయ విద్యార్థులు..
సరిహద్దుల్లో తాము జరిపిన దాడల్లో 55 మంది పాక్ సైనికులు మరణించినట్లు అఫ్గాన్ రక్షణశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. మరికొందరినీ నిర్బంధించినట్లు చెప్పింది. పాక్‌కు చెందిన రెండు కీలక కార్యాలయాలు, 19 చెక్‌పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది. ఈ దాడులు ఇంకా ముగియలేదని.. తమవారు 13 మందే మరణించినట్లు స్పష్టం చేసింది. ఇదిలాఉండగా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియా, తుర్కియే విదేశాంగ మంత్రులతో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి వాళ్లకి వివరించారు. మరోవైపు తాజా పరిణామాలపై చైనా, రష్యా కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. దౌత్య మార్గాల ద్వారా ఈ వివాదాలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి.
Follow Us