/rtv/media/media_files/2026/02/28/indian-enrolments-in-us-varsities-fell-sharply-by-45-percentage-2026-02-28-08-59-59.jpg)
Indian enrolments in US varsities fell sharply by 45 percentage
అమెరికన్ యూనివర్సిటీలలో భారతీయుల సంఖ్య ఏటా పడిపోతూ వస్తుంది. అమెరికా వెళ్లేవారి సంఖ్య దాదాపు 45 శాతం తగ్గిపోయింది. అంతర్జాతీయ విద్యార్థి సమూహాల్లో చూసుకుంటే భారతీయ విద్యార్థుల(indian-students) సంఖ్య భారీగా తగ్గిపోయింది. గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (GMAC) దీనికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసింది. అమెరికా జారీ చేసే విద్యార్థి వీసాల్లో అనిశ్చితి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, అలాగే అక్కడ మారుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని పేర్కొంది.
Also Read: బీజేపీ10 సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..కేజ్రీవాల్ సవాల్!
Indian Enrolments In US Varsities
భారతీయులను భరించాల్సి రావడం కూడా ఈ చేరికలు తగ్గడానికి కారణం అవుతున్నాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ భారీగా పడిపోయింది. దీనివల్ల భారతీయ విద్యార్థుల కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయింది. మరోవైపు అమెరికాలో చైనా, సౌత్ కొరియా, నైజీరియా లాంటి దేశాలకు చెందిన విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోయింది. కానీ ఈ దేశాలతో పోలిస్తే భారతీయలు సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.
Also Read: కరెన్సీ నోట్లు తరలిస్తుండగా కూలిన విమానం.. చెల్లచెదురుగా పడిపోయిన నోట్లు.. 15 మంది మృతి
Follow Us