Bolivian Plane: కరెన్సీ నోట్లు తరలిస్తుండగా కూలిన విమానం.. చెల్లచెదురుగా పడిపోయిన నోట్లు.. 15 మంది మృతి

దక్షిణ అమెరికాలోని బొలియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కొత్తగా ప్రింట్ చేసిన బ్యాంకు నోట్లను మోసుకెళ్తున్న బొలివియన్ మిలిటరీ కార్గొ విమానం అదుపుతప్పి కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Bolivian plane carrying banknotes crashes, leaving 15 people dead

Bolivian plane carrying banknotes crashes, leaving 15 people dead

దక్షిణ అమెరికాలోని బొలియా(Bolivian Plane) లో ఘోర విమాన ప్రమాదం(Plane Crash) జరిగింది. కొత్తగా ప్రింట్ చేసిన బ్యాంకు నోట్ల(Bank Notes) ను మోసుకెళ్తున్న బొలివియన్ మిలిటరీ కార్గొ విమానం అదుపుతప్పి కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కరెన్సీ నోట్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. బొలివియా రాజధాని లా పాజ్‌ సమీపంలోని ఎల్‌ అల్టోలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

Also Read: అగ్నివీర్‌లు, ఆర్మీ సిబ్బందికి గుడ్‌న్యూస్‌.. రిటైరయ్యాక ఆ శాఖలో ఉద్యోగాలు

Bolivian Plane Crash By Carrying Bank Notes

ఇక వివరాల్లోకి వెళ్తే శాంటా క్రజ్ నగరం నుంచి బయలుదేరిన ఈ మిలిటరీ విమానం, ఎల్ ఆల్టో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే క్రమంలో లేదా  అదుపు తప్పి నేలకూలింది. దీంతో అక్కడే ఉన్న హైవేపైకి దూసుకెళ్లి, పలు వాహనాలను ఢీకొంది. విమానం కూలిన ప్రదేశంలో కరెన్సీ నోట్లు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు, వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎల్ ఆల్టో ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. బొలీవియా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించింది. ప్రతికూల వాతావరణం లేదా సాంకేతిక లోపం ఈ ప్రమాదానికి కారణం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: బీజేపీ10 సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..కేజ్రీవాల్  సవాల్!

Advertisment
తాజా కథనాలు