/rtv/media/media_files/2026/02/26/india-2026-02-26-18-45-28.jpg)
కన్నబిడ్డను ప్రాణంగా చూసుకోవాల్సిన ఒక డాక్టర్, తన నాలుగు ఏళ్ల కూతురిని కడతేర్చి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఘటన అమెరికాలో కలకలం రేపుతోంది. భారత సంతతికి చెందిన పీడియాట్రిషియన్ (పిల్లల వైద్యురాలు) నేహా గుప్తా(Indian-Origin Doctor), తన కూతురు ఆరియా తలతిని ఊపిరి ఆడకుండా చేసి చంపి, ఆపై నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి డ్రామా ఆడిందని పోలీసులు తేల్చారు.
🇺🇸 📹
— ⓍULTIMAHORAENX (@ULTIMAHORAENX) February 26, 2026
PEDIATRA ACUSADA POR MUERTE DE SU HIJA EN PISCINA
Las cámaras de seguridad captaron a la madre y la niña en la vivienda de alquiler antes del hallazgo en la piscina.
¿Noticias y tendencias? ¡Sigue @ULTIMAHORAENX para MAS!🔔
Neha Gupta pediatra de Oklahoma… pic.twitter.com/ol8cVhh9BR
Also Read : భారత్ - ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు
అసలేం జరిగింది?
2025 జూన్‌లో ఓక్లహోమాకు చెందిన డాక్టర్ నేహా గుప్తా తన కూతురితో కలిసి ఫ్లోరిడాలోని ఒక రెంటల్ హౌస్‌కు వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో తన కూతురు ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిందని ఆమె 911 (అత్యవసర సేవలు) కు ఫోన్ చేశారు. "నాకు ఈత రాదు.. నా కూతురు పూల్ అడుగున ఉంది, కదలడం లేదు. నేను కాపాడటానికి ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు" అంటూ ఏడుస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వచ్చినప్పుడు చిన్నారి మృతదేహాన్ని పూల్ నుండి బయటకు తీశారు. సుమారు 20 నిమిషాల పాటు చిన్నారి నీటిలోనే ఉందని నేహా గుప్తా నమ్మబలికారు. అయితే, ఆ చిన్నారికి చేసిన శవపరీక్షలో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. ఆరియా ఊపిరితిత్తుల్లో కానీ, కడుపులో కానీ అస్సలు నీరు లేదని డాక్టర్లు తేల్చారు. అంటే ఆమెను పూల్‌లో వేయకముందే చనిపోయిందని నిర్ధారించారు. ఎవరో ముక్కు, నోరు నొక్కి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే ఆ చిన్నారి చనిపోయిందని పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలింది.
ఈ ఘోరానికి నేపథ్యం చూస్తే.. నేహా గుప్తా తన భర్తతో విడాకుల గొడవల్లో ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నారి తండ్రి పూర్తి కస్టడీ (కూతురు తన దగ్గరే ఉండాలని) కోసం ప్రయత్నిస్తున్నాడు. అసలు తన కూతురిని నేహా ఫ్లోరిడాకు తీసుకువెళ్లిన విషయమే తనకు తెలియదని ఆయన పోలీసులకు తెలిపారు. నేహా గుప్తా మానసిక స్థితి సరిగా లేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నేహా గుప్తా జైల్లో ఉన్నారు. ఈ కేసు విచారణ మే నెలలో కోర్టుకు రానుంది.
Also Read : ట్రంప్‌కు బిగ్ షాక్.. ఒక్కటైన ఇరాన్, చైనా.. కీలక రక్షణ ఒప్పందం
Follow Us