/rtv/media/media_files/2025/05/06/JhJJvY1KfmfLd6e35VoK.jpg)
Sujana Chowdary
ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం అయింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడున్న ఓ సూపర్ మార్కెట్ లో కిందపడిపోయారు. దీంతో ఆయన కుడి భుజం ఎముక విరిగిపోయింది. దీంతో సర్జరీ కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ కు తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.
Also Read : Supreme Court : ఎర్రకోట మాదే.. ఇప్పించాలంటూ సుప్రీంలో మహిళ పిటిషన్!
లండన్ పర్యటనకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే @yschowdary గారు సూపర్ మార్కెట్లో కిందపడిపోయారు...
— మన ప్రకాశం (@mana_Prakasam) May 6, 2025
దీంతో సుజనా గారి కుడి భుజం వద్ద ఎముక విరిగింది. సర్జరీ కోసం ఆయనను హైదరాబాద్ తీసుకొస్తున్నారు..
Get well soon sir pic.twitter.com/i8KCc0EDyk
టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి
సుజనా చౌదరి టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. రెండు సార్లు టీడీపీ తరుపున రాజ్యసభ్యుడిగా ఎన్నికైన ఆయన.. మోదీ ఫస్ట్ టర్మ్ క్యాబినేట్ లో కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు. ఆ తరువాత టీడీపీకి రాజీనామా చేసి అనంతరం బీజేపీలో చేరారు. 2024లో జరిగిన ఏపీ శాసనససభ ఎన్నికలలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి ఆసిఫ్ షేక్ పై 47032 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Also read : Miss World Competition : మిస్ వరల్డ్ పోటీలు..మన దేశం నుంచి పాల్గొనే అందాల భామ ఎవరంటే?
injured | london | telugu-news | andhra-pradesh | MLA Sujana Chowdary