/rtv/media/media_files/2025/10/25/another-bus-accident-2025-10-25-17-49-58.jpg)
Another bus accident
Bus Accident : కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ఘటనను మరిచిపోకముందే ఏపీలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద మరో బస్సు ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను దాచేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు దాచేపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ వైపు నుంచి దాచేపల్లి కి వస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. అద్దంకి నార్కెట్ పల్లి హైవే రహదారిపై వేగంగా వస్తూ ముందుగా వెళుతున్న లారీని వేగంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునజ్జు అయింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్‌లో ట్రావెల్స్ బస్సు బోల్తా
మరో ఘటనలో హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఇవాళబస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Also Read: High Paying Jobs: ఫ్రెషర్లకు బెస్ట్ ఆప్షన్స్.. ఈ 5 ఉద్యోగాలకు లక్షల్లో జీతం.. అనుభవం అవసరమే లేదు!
Follow Us