/rtv/media/media_files/2025/07/04/petrol-bunk-2025-07-04-16-09-16.jpg)
petrol-bunk
Rome Petrol Station: ఇటలీలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. రోమ్‌లో ఓ పెట్రోల్ బంక్ పేలింది. మంటల్లో చిక్కుకుని పలువురు సజీవదహనం అయ్యారు. 21 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 9 మంది పోలీసు అధికారులు, ఒక అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. భారీ పేలుడుతో ఒక్కసారిగా రోమ్ నగరం ఉలిక్కిపడింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. సీసీటీవీలో పేలుడు దృష్యాలు రికార్డు అయ్యాయి.
Also Read: Samantha: అతడిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా .. సామ్ కామెంట్స్ వైరల్
క్షతగాత్రులకు మెరుగైన చికిత్స
ఈ ఘటనలో పెట్రోల్ బంక్ దాదాపు పూర్తిగా కాలిపోయింది. మంటలను ఫైర్ ఇంజన్ సిబ్బంది అదుపులోకి తీసుకువస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రధాన మంత్రి జార్జియా మెలోని సంఘటన పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు.
Also Read: రోటీని నెయ్యితో తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!
🚨 Shocking visuals emerge from the petrol station blast in Rome — at least 20 injured, including 8 police officers and a firefighter.
— Mr. Shaz (@Wh_So_Serious) July 4, 2025
Chaos and flames erupt in the heart of the city. 💥🇮🇹
pic.twitter.com/FDzyIjhUl5