Anantapur District : దేవర విషయంలో ఘర్షణ, పదిమందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాళాపురం గ్రామంలో మంగళవారం దేవర వివాదం తీవ్రరూపం దాల్చి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. కర్రలు, కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పదిమందికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

New Update
Clash in Devara, Ten injured

Clash in Devara, Ten injured

Anantapur District: అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాళాపురం గ్రామంలో మంగళవారం దేవర వివాదం తీవ్రరూపం దాల్చి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. కర్రలు, కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Also Read: Kurchi Madathapetti: 'కుర్చీ మడతపెట్టి' పాటకు యమ క్రేజ్.. నేపాల్ వీధుల్లో దుమ్మురేపిన అమ్మాయిలు! వీడియో వైరల్

దేవర విషయంలో ఘర్షణ..

గ్రామంలో నిర్వహించే దేవర ఊరేగింపు విషయంలో గ్రామంలోని రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. దీంతో మాటామాట పెరిగి  ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ధనంజయ (37) తలకు 14 కుట్లు పడగా, వన్నూరు స్వామి (32) తలకు ఎనిమిది కుట్లు పడ్డాయి. జస్వంత్ (17) చేతికి, కడుపు వద్ద కత్తి గాట్లతో గాయాలు కావడంతో ఆరు కుట్లు వేయాల్సి వచ్చింది. గాయపడిన వారిని విడపనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘర్షణలో పదిమందికి పైగా గాయపడినట్లు సమాచారం. అయితే, ధనంజయ పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని అత్యవసరంగా అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

Also Read:  భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!

సంఘటనపై స్పందించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్న గౌస్ మాట్లాడుతూ "గ్రామంలో దేవర విషయంలో తలెత్తిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారినట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితులు చక్కబడ్డాయని అయితే ముందు జాగ్రత్తగా గ్రామంలో శాంతిని కాపాడేందుకు పోలీసు బలగాలను మోహరించాం. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని పేర్కొన్నారు.

Also Read: రేవంత్ సర్కార్ వ్యాపారవేత్తలను వేధిస్తోంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మాళాపురం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, మరిన్ని అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై ఖాజా హుస్సేన్ తెలిపారు.

Also Read:  ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు