IND vs PAK: పాక్‌పై భారత్ ఘనవిజయం
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాక్‌పై ఘన విజయం సాధించింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 42.3 ఓవర్లలో 242 పరుగులు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 111 బంతుల్లో సెంచరీ చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాక్‌పై ఘన విజయం సాధించింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 42.3 ఓవర్లలో 242 పరుగులు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 111 బంతుల్లో సెంచరీ చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. 36 ఓవర్లలో టీమిండియా స్కోర్ 200 పరుగులు దాటింది. గెలుపు దిశగా టీమిండియా వెళ్తుంది. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ పరుగులతో రాణిస్తున్నారు. హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ సెంచరీకి చేరువలో ఉన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతున్నారు. కోహ్లీ 61 బాల్‌లకు 47 స్కోర్ చేయగా.. శ్రేయస్ అయ్యర్ 27 బంతులకు 12 పరుగులు తీశాడు. 26 ఓవర్లకు మొత్తం స్కోర్ 128 ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్, టీమిండియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పేసర్ మహమ్మద్ షమీ చెత్త రికార్డును నమోదు చేశాడు. మొదటి ఓవర్లో ఐదు వైడ్లు వేసి ఆరు పరుగులు ఇచ్చాడు. ఇది వరకే జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్లు ఉండగా.. వారి సరసన కూడా షమీ చేరాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతోన్న మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవు. బంగ్లాదేశ్‌తో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు ప్రెస్టీజియస్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ ల మధ్య జరగనుంది. ఇందులో టీమ్ ఇండియా ఎలా అయినా గెలవాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు. అయితే స్టార్ బ్యాటర్ కోహ్లీ, వికెట్ కీపర్ పంత్ లు ఈ మ్యాచ్ లో ఆడతారా లేదా అనేది సందేహంగా మారింది.
న్యూజిలాండ్ చేతిలో ఓడిన పాకిస్తాన్ జట్టుకు భారత్‌తో మ్యాచ్ డు ఆర్ డై అనే చెప్పాలి. భారత్ చేతిలో ఓడిపోతే కనుక ఈ టోర్నమెంట్లో సెమీఫైనల్స్‌కు చేరుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్ లో ఓడిపోతే న్యూజిలాండ్ జట్టుపై గెలవాల్సి ఉంటుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్ లూ ఒక లెక్క...భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఒక లెక్క. ఈ రెండు జట్లూ తలపడుతున్నాయి అంటే ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇలాంటి హై ఓల్టేజ్ మ్యాచ్ కు ఈరోజు దుబాయ్ సిద్ధం అవుతోంది.
పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ ఆరంభ సమయంలో భారత జాతీయ గీతం ప్లే చేసి షాక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా ఫన్నీ కామెంట్స్ పేలుతున్నాయి.