IND vs PAK: మొదటి ఓవర్‌లో షమీ చెత్త రికార్డు

ఛాంపియన్స్ ట్రోఫీ‌లో పాకిస్థాన్, టీమిండియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పేసర్ మహమ్మద్ షమీ చెత్త రికార్డును నమోదు చేశాడు. మొదటి ఓవర్‌లో ఐదు వైడ్‌లు వేసి ఆరు పరుగులు ఇచ్చాడు. ఇది వరకే జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్‌లు ఉండగా.. వారి సరసన కూడా షమీ చేరాడు.

New Update
IND vs NZ: షమీ అదుర్స్.. సెంచరీ బాదిన కివీస్ మొనగాడు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

Shami

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నేడు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడింది. అయితే టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదటిగా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ క్రమంలో టీమిండియా బౌలింగ్ వేసింది. అయితే ఇండియా పేసర్ మహమ్మద్ షమీ మొదటి ఓవర్ వేసి చెత్త రికార్డును నెలకొల్పాడు. తొలి ఓవర్‌లో మొత్తం ఐదు వైడ్ బాల్స్ వేసి, ఆరు పరుగులు ఇచ్చాడు. అయితే టీమిండియా తరపున ఒక ఓవర్‌లో ఇన్ని బంతులు వేసిన వారిలో జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్‌లు ఉన్నారు. ఇప్పుడు వారి సరసన షమీ చేరాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తోంది. మొత్తం 35 ఓవర్లకు 161 స్కోర్ చేసింది. ప్రస్తుతం పాకిస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఇది కూడా చూడండి: Sridhar Babu: MLC ఎన్నికలకు దూరం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన!

భారత్ జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, కుల్‌దీప్‌ యాదవ్

ఇది కూడా చూడండి:Pope: పోప్‌ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఏమీ చెప్పలేమంటూ అధికారుల ప్రకటన!

పాక్ జట్టు

ఇమామ్‌ ఉల్ హక్, బాబర్ అజామ్, సౌద్‌ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్‌ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్‌ రవూఫ్, అబ్రార్‌ అహ్మద్

ఇది కూడా చూడండి:Almond Vs Coconut Oil: బాదం నూనె వర్సెస్‌ కొబ్బరి నూనె.. ఏది మంచిది?

Advertisment