Kaman Bridge: 6 సంవత్సరాల తరువాత తెరుచుకున్న పాక్-ఇండియా మధ్య వంతెన!
భారతదేశం, పాకిస్తాన్ మధ్య 6 ఏళ్ల తర్వాత కమాన్ వంతెన తిరిగి మరోసారి తెరుచుకుంది. జీలం నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న జంట మృతదేహాలను తిరిగి ఇచ్చేందుకు ఈ వంతెనను తెరిచినట్లు సమాచారం.
భారతదేశం, పాకిస్తాన్ మధ్య 6 ఏళ్ల తర్వాత కమాన్ వంతెన తిరిగి మరోసారి తెరుచుకుంది. జీలం నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న జంట మృతదేహాలను తిరిగి ఇచ్చేందుకు ఈ వంతెనను తెరిచినట్లు సమాచారం.
భారతదేశం స్థూల జాతీయోత్పత్తి బాగా పెరిగింది. పదేళ్ళల్లో ఇది డబుల్ అయింది. 2015లో 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న జీడీపీ..2025నాటికి 4.3 ట్రలియన్ల డాలర్లకు చేరడం ద్వారా గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించిందని చెబుతోంది ఐఎమ్ఎఫ్.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకి బీసీసీఐ భారీ క్యాష్ ప్రైజ్‌ను ప్రకటించింది. ఛాంపియన్స్‌కు మొత్తం రూ.58 కోట్ల ప్రైజ్ మనీని అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మనీని ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, సెలెక్షన్ కమిటీకి అందజేస్తారు.
ఫిన్లాండ్ వరుసగా ఎనిమిదోసారి సంతోషకరమైన దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో ఐస్లాండ్, నాలుగో స్థానంలో స్వీడన్ దేశాలు నిలిచాయి. ఇక భారత్‌కు ఈసారి 118వ ర్యాంక్ వచ్చింది.
జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవడంపై శ్రేయస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'నా ఆట గురించి ఎవరికీ ప్రత్యేకంగా సందేశం పంపాల్సిన అవసరం లేదు. నాపై నమ్మకం ఉంచుకుని బెస్ట్ క్రికెట్ ఆడడమే. హార్డ్ వర్క్ వల్లే మళ్లీ ఈ స్థాయిలో రాణిస్తున్నా' అన్నాడు.
భారత్‌కు వస్తే తనకు ఇంట్లో ఉన్నట్లే ఉంటుందని అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ అన్నారు.రెండున్నర రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చిన ఆమె ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు.
ఫ్రిడ్ మన్ పాడ్ కాస్ట్ లో ప్రధాని మోదీ కీలక అంశాలు మాట్లాడారు. ముఖ్యంగా పక్క దేశాలైప చైనా, పాకిస్తాన్ లతో సంబంధాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పాక్ తో శాంతి కోసం ప్రయత్నిస్తే..నమ్మకద్రోహం ఎదురైందని మోదీ అన్నారు.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ నేడే జరగనుంది. ఈ ఫైనల్లో భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. క్రికెట్ లెజెండరీ సచిన్ టెండూల్కర్ ఈ ఇండియా మాస్టర్స్ లీగ్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బద్నావర్-ఉజ్జయిని రోడ్డులోని బామన్సుత గ్రామ సమీపంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.