Vizianagaram Terrorists Latest Updates | ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారంటే! | India Pak War | RTV
పాకిస్థాన్‌కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఇకనుంచి పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడేది లేదని తేల్చిచెప్పింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్ నుంచి వైదొలగనుంది. ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఈ సమాచారం ఇచ్చింది.
పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన తర్వాత అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) పాకిస్థాన్‌పై మరింత ఒత్తిడి తీసుకొస్తోంది. ఇందుకోసం మరో 11 ఆర్థికపరమైన షరతులు విధించింది.
భారత్ పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఇరుదేశాలు ప్రత్యక్ష చర్చలు జరపాలని అమెరికా, చైనా భారత్‌కు ఇటీవలే సూచనలు చేశాయి. ఇప్పుడు తాజాగా రష్యా కూడా ఈ సూచనే చేసింది. ఈ విషయంలో ఇరుదేశాలు ముందుకెళ్లాలని కోరుతున్నామని తెలిపింది.
పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కేంద్రానికి సూచించారు. ఇందుకోసం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లో సవరణలు చేయాలన్నారు. ఉగ్రవాదాన్ని పెకలించేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలన్నారు.