/rtv/media/media_files/2025/05/21/LBpGFQ8hDgZKVP5NI3yx.jpg)
Water Crisis in Pakistan, Sindh Home Ministers’ residence in Moro set on fire by protesters
ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో అంతర్యుద్ధం మొదలైంది. ఇప్పటికే పాక్‌కు చుక్కలు చూపిస్తున్న
బలూచిస్థాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. మరోవైపు సింధ్ ప్రాంత ప్రజలు నీళ్ల కోసం అవస్థలు పడుతున్నారు. రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కారించాలంటూ గత కొన్నిరోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు.
Also Read: ఇద్దరు బంగ్లా దేశీయులకు బిగ్ షాక్.. ఆ కేసులో కఠిన కారాగార శిక్ష
రోడ్లపై వాహనాలు ధ్వంసం చేస్తూ నినాదాలు చేస్తున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారాయి. అక్కడ ఓ పాకిస్థాన్ మంత్రి ఇంటికి స్థానికులు ఏకంగా నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, పోలీసులు మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు ఆ దేశ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అత్యున్నత ఆర్మీ ర్యాంక్ అయిన ఫీల్డ్ మార్షల్ హోదాను అసీమ్ మునీర్‌కు ఇస్తున్నట్లు పాక్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్తాన్‌లో ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ పొందిన రెండో వ్యక్తి అసీమ్ మునీర్. ఈ ర్యాంక్ చాలా అరుదు. చివరిసారిగా 1959లో జనరల్ అయూబ్ ఖాన్‌కు లభించింది. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: జ్యోతి మల్హోత్రా డైరీ స్వాధీనం.. వెలుగులోకి సంచలన విషయాలు
ప్రస్తుతం ఆయన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా విధులు నిర్వహిస్తూ జనరల్ ర్యాంక్‌లో ఉన్నారు. భారత్, పాక్ ఉద్రిక్తతలు, పరస్పర దాడులు చేసుకుంటున్న సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో యుద్ధం మధ్యలో పారిపోయినోడికి ప్రమోషన్ ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ అసీమ్ మునీర్ ఆయనకు ఆయనే ఇచ్చుకున్నారని ఎద్దేవా చేస్తూ ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు.
Also Read: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు
Sindh | telugu-news | india-pakistan