/rtv/media/media_files/2025/05/22/o48cOgxaOnev3BEAu0YN.jpg)
Pakistan to extend closure of its airspace for Indian flights by another month
భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న క్రమంలో భారత్ విమానాలకు పాక్ తన గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని మరో నెలరోజుల పాటు పొడిగించనుంది పాకిస్థాన్. ఒకట్రెండు రోజుల్లో పాక్ ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు అక్కడి స్థానిక మీడియా తెలిపింది. వాస్తవానికి ఇంటర్నేషన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) రూల్స్ ప్రకారం.. ఏ దేశం కూడా గగనతల ఆంక్షలు ఒకేసారి నెలరోజుల కంటే ఎక్కువ కాలం విధించేందుకు వీలు లేదు.
Also Read: మరో పాకిస్తాన్ హై కమిషన్ ను బహిష్కరణ..24 గంటల టైమ్
పాకిస్థాన్ ఏప్రిల్‌లో భారత విమానాలకు తమ గగనతలంపై నిషేధం విధించింది. ఇది మే 23 వరకు అమల్లో ఉండనుంది. అయితే ఇప్పుడు తాజాగా పాక్ ప్రభుత్వం దీన్ని మరో నెలరోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పాక్ కేవలం ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలో కూడా పలుమార్లు భారత విమానాలకు గగనతల ఆంక్షలు విధించింది. 1999లో కార్గిల్ యుద్ధం, 2019 పుల్వామా ఘటన సమయంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగినప్పుడు కూడా ఈ ఆంక్షలు విధించింది పాక్.
ఇక పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్, POKలోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట వైమానిక దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే సింధూ నది జలాల ఒప్పందం నిలిపివేయడం, పాక్ పౌరులను భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించడం, సరిహద్దు మూసివేయడం, అలాగే పాక్ విమానాలు కూడా భారత గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించడం వంటి ఆంక్షలు పెట్టింది.
Also Read: అసలే ఎండకాలం, పైగా కరెంట్ కోతలు.. ఏటీఎంలో చల్లగా ఉంటుందని అంతా అక్కడికెళ్లి..
ఇదిలాఉండగా పాకిస్తాన్ హైకమిషన్ లోని ఓ అధికారిని పర్శనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించింది కేంద్రం. ఇతనిని విధుల నుంచి తొలగిస్తూ దేశం విడిచి 24 గంటల్లోగా వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. ఈ నెలలో ఇది రెండోసారి బహిష్కరణ. మే 13న.. ఓ పాకిస్థాన్ అధికారిని భారత్ బహిష్కరించింది.\
india-pakistan