Monsoon Teas: ఈ టీలు ఇమ్యూనిటీని పెంచడమే కాదు.. ఆ వ్యాధులకు చెక్ పెడుతుంది!
వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అంటు వ్యాధులు తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మనపై ఎఫెక్ట్ చూపకుండానే ఇమ్యునిటీని పెంచుకోవాలి. చిన్నారుల్లోనూ, పెద్ద వారిలోనూ ఫ్లూ, దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్స్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. వాటిని నివారించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమే. ఈ సీజనల్ వ్యాధుల నుంచి బయట పడేందుకు మనం ఇంట్లోనే ఈజీగా కొన్ని కషాయాలు, టీలు చేసుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా. వర్షాకాలం, చలికాలాల్లో ఈ టీ తాగితే సీజనల్ ఇన్ఫెక్షన్స్ ని దూరంగా ఉంచుతుంది. దగ్గు, జ్వరం నుంచి ఉపశమనం ఇస్తుంది.