Hydra: హైడ్రా నెక్స్ట్ టార్గెట్ హైటెక్ సిటీ.. కూల్చేది వాటినే!
ఆక్రమణల కూల్చేవేతలతో దూకుడు మీద ఉన్న హైడ్రా ఇప్పుడు హైటెక్‌సిటీలోని నాలాలపై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం మరో వారం రోజుల్లో ప్రత్యేక బృందంతో ఏరియల్ సర్వే చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.
ఆక్రమణల కూల్చేవేతలతో దూకుడు మీద ఉన్న హైడ్రా ఇప్పుడు హైటెక్‌సిటీలోని నాలాలపై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం మరో వారం రోజుల్లో ప్రత్యేక బృందంతో ఏరియల్ సర్వే చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.
హైడ్రా మొత్తం 111 ఎకరాల చెరువుల భూములను కాపాడినట్లు తెలిపింది. అత్యధికంగా అమీన్ పూర్ లేక్ 51.78, బుమ్రాక్ డౌలా12, సున్నం చెరువు 10, గండిపేట్ లేక్ 8.75, గండిపేట్ చిల్కూర్ 6.5 ఎకరాలతోపాటు మొత్తం 23 ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్‌లో చెరువులు ఆక్రమించిన వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. స్వచ్ఛందంగా అక్రమ నిర్మాణాలను వదిలి వెళ్లాలని, లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరించారు.
హైడ్రాను మరింత బలోపతం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి పోలీసు అధికారులను కేటాయించింది తెలంగాణ గవర్నమెంట్. 15 మంది ఇన్స్పెక్టర్లు, ముగ్గురు రిజర్వ్ ఇన్స్పెక్టర్ల, ఆరుగురు ఎస్ఐలను కేటాయిస్తూ డీజీ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు.
హైడ్రాకు మరో కీలక బాధ్యతలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. చెరువులు, నాలాల సమీపంలోని నూతన భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతి తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆలోచలనలో ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలనే అమలు చేయాలని పిటిషనర్ కోరారు. ఇందుకు హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. చట్టం అమల్లోకి రాగానే మొట్ట మొదటగా బుడమేరు ఆక్రమణలే తొలగిస్తామని చెప్పారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా పేదల గూడు కూల్చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన 4 వేల డబుల్ బెడ్రూం ఇళ్లల్లోకి పేదలను తరలించాలని రాష్ట్ర సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు.