Hydra : హైడ్రాకు షాక్.. ఢిల్లీలో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు!

హైడ్రాకు షాక్ తగిలింది. హైడ్రాపై మానవ హక్కుల సంఘానికి సున్నం చెరువు బాధితులకు ఫిర్యాదు చేశారు. తమకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయకుండా ఉన్నపళంగా గుడిసెలు తొలగించడంపై బాధితుల ఫిర్యాదు చేశారు.

author-image
By V.J Reddy
New Update
hydra

Hydra: హైదరాబాద్ లో చెరువులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రకు షాక్ తగిలింది. హైడ్రాపై జాతీయ మానవ హక్కుల సంఘానికి బాధితుల ఫిర్యాదు చేశారు. ఈనెల 8న సున్నం చెరువులో గుడిసెలను హైడ్రా కూల్చివేసింది. తమకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయకుండా ఉన్నపళంగా గుడిసెలు తొలగించడంపై బాధితుల ఫిర్యాదు చేశారు. హైడ్రా రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించిందని బాధితులు వాపోతున్నారు. 1985 ఓల్గా టెల్లిస్‌ వర్సెస్‌ బాంబే మున్సిపల్‌ కార్పొరేషన్‌ కేసులో సుప్రీం తీర్పు ఇచ్చిన విషయాన్ని ఫిర్కాదులో బాధితులు పేర్కొన్నారు. కాగా హైడ్రా పై మానవ హక్కుల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

నెక్స్ట్ టార్గెట్ హైటెక్ సిటీ!

హైదరాబాద్ లో అక్రమకట్టడల ను నేలమట్టం చేస్తున్న హైడ్రా ఇప్పుడు హైటెక్ సిటీ పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మాదాపూర్, జూబ్లీహిల్స్, మణికొండ వంటి ప్రాంతాల్లోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్​జోన్లలో నిర్మించిన అక్రమకట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. కాగా ఇప్పుడు హైటెక్ సిటీలోని చెరువులు, నాలాలను కబ్జా చేసి కట్టిన కట్టడాలను కూల్చేందుకు అధికారులు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే చెరువులు ఆక్రమించి కొంతమంది పలు బాడాబాబులు కట్టిన బిల్డింగులు పడగొట్టిన హైడ్రా ఇప్పుడు పైలెట్ ప్రాజెక్టు కింద ఇక్కడి రెండు నాలాలను సర్వే చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.

సర్వే చేసిన ఆ నివేదికను హైడ్రా ప్రభుత్వానికి అందించనుంది. కాగా హైడ్రా నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేసి.. కూల్చివేతలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సర్వేను ఇంకో వార్మ్ రోజుల్లో హైడ్రా అధికారులు ప్రారంభించనున్నట్లు సమాచారం. కాగా దీనిపై ఇటీవల హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశమయ్యారు. కాగా హైటెక్ సిటీలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో ముందు వస్తుందో వేచి చూడాలి.

Also Read :  అరికెపూడి ఇంటి వద్ద టెన్షన్.. టెన్షన్

Advertisment
Advertisment
తాజా కథనాలు