BREAKING: హైడ్రా దూకుడు.. ఈరోజు కూల్చేది వాళ్లదే!
TG: హైడ్రా దూకుడు పెంచింది. ఈరోజు బాచుపల్లి బౌరంపేట, బోరబండ సున్నపు చెరువులో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు భారీగా మోహరించారు.
TG: హైడ్రా దూకుడు పెంచింది. ఈరోజు బాచుపల్లి బౌరంపేట, బోరబండ సున్నపు చెరువులో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు భారీగా మోహరించారు.
TG: హైడ్రాపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రాను హెచ్ఎండీఏ వరకు విస్తరించేందుకు సిద్ధమైంది. మొత్తంగా వ్యవస్థను మూడు జోన్లుగా విభజించి, వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించనుంది.
హైడ్రా దెబ్బకు హైదరాబాదీల ట్రెండ్ మారిపోతుంది. ఇండ్లు కొనేవారికి చెరువుల ఫుల్ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ల గురించి అవగాహన పెరిగింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో లేక్ వ్యూ బదులు ‘గార్డెన్ ఫేస్’ అంటూ బిల్డర్లు ప్రచారం మొదలుపెట్టారు.
TG: పెద్దపల్లిలో ఆక్రమ కట్టడాలపై కలెక్టర్ ఫోకస్ పెట్టారు. చెరువుల ఆక్రమణలపై కలెక్టర్ సర్వే చేయించారు. బందంపల్లిలో ఆక్రమ నిర్మాణాలను గుర్తించిన కలెక్టర్.. అధికారులకు వాటిని కూల్చివేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు.
తెలంగాణలో హైడ్రా ఎఫెక్ట్‌తో భూముల రిజిస్ట్రేషన్ భారీగా తగ్గిపోయింది. జులైతో పోలిస్తే ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్ల ఆదాయం దాదాపు రూ.320 కోట్లు తగ్గినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. జులైలో 58 వేల రిజిస్ట్రేషన్లు కాగా.. ఆగస్టులో 41 వేల 200 మాత్రమే అయినట్లు వెల్లడించారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో హైడ్రా తరహా వ్వవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. త్వరలోనే చెరువుల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కబ్జాలపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై యాక్షన్ తీసుకుంటామన్నారు.
హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్‌కు సీఎం రేవంత్ మరో కీలక పదవి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకోసం ఏర్పాటుచేసిన 'లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ' ఛైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం. 7జిల్లాల్లో చెరువులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
భారీ వర్షాల నేపథ్యంలో కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చింది హైడ్రా. హైడ్రా అధికారులంతా ప్రస్తుతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. చెరువుల చుట్టుపక్కల కాలనీల్లో పర్యటిస్తూ నీట మునిగిన ప్రాంతాలను మార్క్ చేస్తున్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్. దీంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతోంది.
తెలంగాణలో హైడ్రా మరింత దూకుడు పెంచింది. అమీన్పూర్ చెరువు బఫర్ జోన్లో నిర్మించిన భవనాలను కూల్చేందుకు హైడ్రా సిద్ధమైంది. దీంతో ఫ్లాట్స్ బుక్ చేసుకున్నవారు బుకింగ్స్ రద్దు చేసుకోగా బిల్డర్లు భారీగా నష్టపోతామంటూ తలలు పట్టుకుంటున్నారు.