Health Tips: పండ్ల రసాలు ఎక్కువగా తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! షుగర్ ఉండే పండ్ల రసాలను రోజుకి రెండు కంటే ఎక్కువసార్లు తాగితే గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. పండ్ల రసాల్లోని షుగర్ వల్ల హార్ట్‌స్ట్రోక్‌తో పాటు మధుమేహం కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 01 Nov 2024 in లైఫ్ స్టైల్ Short News New Update షేర్ చేయండి Heart Stroke: ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది పండ్ల రసాలు ఎక్కువగా తాగుతుంటారు. వీటిలో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. అయితే కొందరు పండ్ల రసాలను ఎక్కువగా తాగుతుంటారు. రోజుకి ఒకసారి కాకుండా రెండు నుంచి మూడు సార్లు తాగుతుంటారు. ఇలా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చూడండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్.. అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీళ్లే! అతిగా తాగడం వల్ల.. ఏ పదార్థాన్ని అయిన లిమిట్‌లో కాకుండా అధిక మొతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే పండ్ల రసాల్లో ఎక్కువ శాతం చక్కెర ఉంటుంది. ఇలా ఎక్కువగా తాగడం వల్ల గుండె పోటు ప్రమాదాలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజులో రెండు సార్లు కంటే ఎక్కువగా పండ్ల రసాలు తాగితే తప్పకుండా గుండె పోటు వస్తుందని అంతర్జాతీయ స్ట్రోక్ నిపుణుల బృందం ఇటీవల తెలిపింది. ఇది కూడా చూడండి: స్పెయిన్‌లో వరద విలయ తాండవం.. కుప్పకుప్పలుగా మృతదేహాలు! రోజుకు మూడుసార్లు పండ్ల రసాలు తాగితే తప్పకుండా ఈ ప్రమాదం రెట్టింపు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండ్ల రసాల్లోని చక్కెర గుండె పోటు వచ్చే ప్రమాదాలను 37 శాతం పెంచుతుంది. అయితే ఈ పురుషుల కంటే మహిళలు అందం కోసం ఎక్కువగా జ్యూస్‌లు తాగుతుంటారు. వీరికే గుండె పోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. పండ్ల రసాల్లో కేవలం షుగర్ మాత్రమే ఉంటుంది. ఇందులోని పోషకాలు, ఫైబర్ తొక్క ద్వారా బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల జీర్ణక్రియ ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ప్రేగు ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ఇది కూడా చూడండి: సినిమా లెవల్‌లో గంజాయి అక్రమ రవాణా.. స్వాధీనం చేసుకున్న పోలీసులు పండ్ల రసాల్లోని చక్కెర కారణంగా మధుమేహం కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండ్ల తొక్కలను వేరు చేసే జ్యూస్‌లు కాకుండా వాటితో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. తొక్కల్లోనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పండ్ల రసాలను బయట కాకుండా ఇంట్లోనే తయారు చేసి తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చూడండి: దాడికి సిద్ధమవుతున్న ఇరాన్.. ఈసారి మూడో ప్రపంచ యుద్ధమే! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #heart-strokes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి