Hanumakonda : హనుమకొండలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి..నగరంలో హై టెన్షన్

వరంగల్‌ జిల్లా హనుమకొండ పట్టణంలోని నయీంనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు స్కూల్‌లో విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఇక్కడి తేజస్వి పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న సురజిత్ ప్రేమ్ అనే విద్యార్థి తలనొప్పితో ఈ రోజు మరణించాడు.

New Update
125165822_110925student1a

Student dies under suspicious circumstances..

Hanumakonda : వరంగల్‌ జిల్లా హనుమకొండ పట్టణంలోని నయీంనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న  ఓ ప్రైవేటు స్కూల్‌లో విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఇక్కడి తేజస్వి పాఠశాలలో నాల్గోతరగతి చదువుతున్న సురజిత్ ప్రేమ్ అనే 9 ఏండ్ల  విద్యార్థి తలనొప్పితో ఈ రోజు మరణించాడు. విద్యార్థిని ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే బ్రెయిన్ డెడ్ అయినట్లు  వైద్యులు చెబుతున్నారు. విద్యార్థి తీవ్ర తలనొప్పితో బాధపడుతుండటంతో ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు తెలిపారు.

హనుమకొండ గుండ్లసింగారానికి చెందిన విద్యార్థి సురజిత్ ప్రేమ్‌ ఉదయం ఇంటినుంచి ఆరోగ్యంగానే వచ్చాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. అలాంటిది విద్యార్థికి ఒక్కసారిగా తలనొప్పి వచ్చందని అతన్ని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడని పాఠశాల యాజమాన్యం చెబుతుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి సురజిత్ ప్రేమ్ మృతితో స్కూల్ ఎదుట తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. కాగా సెప్టెంబర్‌లో ఇదే పాఠశాలలో పదోతరగతి చదవుతున్న మరో విద్యార్థి జయంత్ వర్థన్ కూడా అనుమాన స్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో అతని తల్లిదండ్రులు, బంధువులు కూడా ఆందోళనకు దిగడంతో స్కూల్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.దీంతో యాజమాన్యం  పాఠశాల గేటుకు తాళం వేసి  పరారైంది.  

అయినప్పటికీ స్కూల్ ఎదుట విద్యార్థులు సురజిత్ ప్రేమ్, జయంత్ వర్థన్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమ చిన్నారులని ఈ పాఠశాల యాజమాన్యం దారుణంగా పొట్టన పెట్టుకుందని వారు ఆరోపిస్తున్నారు. ఆందోళనతో స్కూల్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాలపై దాడికి బంధువులు యత్నించడంతో భారీగా పోలీసులను స్కూలు వద్ద మోహరించారు. దాడి చేయకుండా అడ్డుకున్నారు.
 
ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన తీవ్రం కావడంతో హనుమకొండ ఏసీపీ నర్సింగరావు వెంటనే పాఠశాల దగ్గరకి చేరుకున్నారు. బంధువులతో ఏసీపీ నర్సింగరావు మాట్లాడారు. ఆందోళన విరమించాలని ఏసీపీ నర్సింగరావు కోరారు.  విద్యార్థుల కుటుంబాలకి న్యాయం చేస్తామని ఏసీపీ నర్సింగరావు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Also Read :  సర్పంచ్ గా పోటీ చేస్తున్నారా? ఈ గుడ్ న్యూస్ మీ కోసమే.. ఆ నిబంధనకు గుడ్ బై

Advertisment
తాజా కథనాలు