/rtv/media/media_files/2025/11/12/fotojet-71-2025-11-12-15-01-28.jpg)
Strangers left behind 2,000 hens
Hanumakonda Hens: నవంబర్ 8న.. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా రెండు వేల నాటు కోళ్లు ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. గుర్తుతెలియని అగంతకులు గ్రామంలోని రహదారిపై నాటుకోళ్లను వదిలేశారు. దీంతో ఆ ఊరి ప్రజలు ఎగబడి అందినకాడికి కోళ్లను పట్టుకెళ్లారు. ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు కానీ వేల సంఖ్యలో నాటు కోళ్లు ఆ పైరుల్లో ప్రత్యక్షమయ్యాయి.దీంతో చాలామంది వాటిని తీసుకువెళ్లినప్పటికీ చాలామంది అనుమానంతో వాటిని తినలేదు. గ్రామానికి చెందిన అధికారులు సైతం కోళ్లను స్వాధీనం చేసుకుని గ్రామ కార్యాలయంలో వాటిని భద్ర పరిచారు.
అనంతరం వాటిలో కొన్నింటిని వెటర్నటీ టెస్టింగ్ కోసం పంపించారు. అయితే ఆ కోళ్లకు ఎలాంటి వ్యాధులు లేవని తెలిసిన తర్వాత వాటిని తిరిగి ఇచ్చేశారు. దీంతో ఊరు ఊరంతా నాటుకోడి పులుసుతో గుభాళించింది. ఇదంతా బాగానే ఉంది కానీ, అసలు నాటుకోళ్లు వదిలింది ఎవరనే విషయంలో సందిగ్ధత నెలకొంది. దానికి కారణమేంటో తాజాగా వెల్లడైంది.కాగా ఈ విషయమై దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి.ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఓ యజమాని వాటిని అలా రోడ్డుపై వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే..
గతవారం కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి గ్రామంలోని పొలాలలో సుమారు రెండు వేల నాటుకోళ్లు ప్రత్యక్షమయ్యాయ్ గుర్తుందా.? ఆ రోజు గ్రామస్థులు వాటిని పట్టుకుని, వండుకు తిని ఊరంతా ఓ పండుగలా భావించారు. దానికి కారణమేంటో తాజాగా వెల్లడైంది. యజమాని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన ఫాంలో ఉన్న కోళ్లను తీసుకొచ్చి ఇలా వదిలేసినట్లు తెలిసింది.నంతరం వాటిని కూరగా వండుకు తిన్నారు. దీంతో ఆరోజు ఆ ఊళ్లో పండుగ వాతావరణమే తలపించింది.! కొంతమంది వెంటనే నాటు కోడి పులుసు చేసుకుని సంతోషంగా విందు చేసుకున్నారు. మరికొంతమంది మాత్రం అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసుల దర్యాప్తులో ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగు చూశాయి. యజమాని ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే వాటిని వదలినట్లు తెలిసి అంతా షాక్ అయ్యారు. పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించనున్నారు.
Follow Us