/rtv/media/media_files/2025/01/16/JaXuMYyhvhzWmTHCRET4.jpg)
firing in hyd Photograph: (firing in hyd)
నగరం నడిబొడ్డున హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో గురువారం కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ఓ బస్ క్లీనర్ గాయపడ్డాడు. బీదర్‌లో ఓ ఏటీఎం వ్యాన్ కొల్లగొట్టిన దొంగల ముఠా డబ్బులతో పారిపోయి హైదరాబాద్ వచ్చింది. వారిని పట్టుకోవడానికి వచ్చిన బీదర్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగల ముఠా మూడు రౌండ్ల కాల్పులు జరిపింది.
ఇది కూడా చదవండి: BIG BREAKING: టీడీపీలోకి మంచు మనోజ్!
అఫ్జల్‌గంజ్‌లోని ఓ ట్రావెల్స్ ఆఫీసులోకి సినిమా రేంజ్‌లో దొంగలు పోలీసులపై కాల్పులు జరిపారు.ఈక్రమంలో బస్సు క్లీనర్ కు బుల్లెట్ తాకింది. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన సిటీ పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.
ఇది కూడా చదవండి: Mumbai: సైఫ్ కేసులోకి ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు ఎంట్రీ.. వణికిపోతున్న ముంబై మాఫియా!
కర్ణాటకలోని బీదర్‌లో ఓ ఏటీఎం క్యాష్ వ్యాన్‌పై దొంగల ముఠా కాల్పులు జరిపారు. ఈ కాలుల్లో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. డబ్బులతో పరారైన దొంగల ముఠా హైదరాబాద్‌కు వచ్చారు. సమాచారం అందుకున్న బీదర్ పోలీసులు నిందితులను వెంబడిస్తూ హైదరాబాద్‌కు వచ్చారు. అఫ్జల్‌గంజ్‌లో తలదాచుకున్న దొంగలు బీదర్ పోలీసులను చూసి వారిపై కాల్పులు జరిపారు.
ఇది కూడా చదవండి: Ananya nagalla: సంక్రాంతికి అరిసెలు చేసిన అనన్య నాగళ్ల.. వీడియో వైరల్!
Follow Us