/rtv/media/media_files/2025/03/29/1JulEyWQ6TuRZqiTKh3M.jpg)
gun fire in hyderabad
Gun Fire: హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. గుడిమల్కాపూర్లోని కింగ్స్ ప్యాలెస్లో ఆనం మీర్జా ఎక్స్పోలో ఓ షాప్కీపర్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఇద్దరు షాపు కీపర్ల మధ్య గొడవ తలెత్తడంతో ఓ షాపు కీపర్ తనవద్ద ఉన్న తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపాడు. గుడి మల్కాపూర్‌లో గల కింగ్స్ ప్యాలెస్‌లోని ఆనం మీర్జా ఎక్స్‌పోలో వ్యాపారులు దుకాణాలు భారీగా ఏర్పాటు చేశారు. ఇద్దరు దుకాణాదారుల మధ్య ఓ విషయంలో వాగ్వాదం జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరడంతో ఒక షాప్ కీపర్ గాలిలో కాల్పులు జరిపాడు. ఈ ఘటన జరగడంతో ఎక్స్‌పో చూడటానికి వచ్చిన సందర్శకులు అక్కడి నుంచి భయటకు పరుగులు తీశారు. కాల్పులు జరగడంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
Also Read: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ ఎంపీ హర్షకుమార్ కు పోలీసుల నోటీసులు!
స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం తెలియడంతో వెంటనే సంఘటన జరిగిన స్థలానికి పోలీసులు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గాలిలో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు నిర్ధరించారు. కాల్పుల ముందు అసలు ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీశారు. కాల్పుల సంఘటనకు సబంధించి సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాల్పులకు కారణమైన ఇద్దరు దుకాణాదారుల మధ్య పాతకక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
కాల్పుల శబ్దంతో కలకలం నెలకొనగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గాలిలో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఎక్స్పో నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఎక్స్పో ప్రాంతంలో భద్రతను పెంచినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనతో ఎక్స్‌పోకు వచ్చిన ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, పోలీసులు వెంటనే స్పందించడంతో పరిస్ధితి అదుపులోకి వచ్చిందని అక్కడి స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.
Also Read: Mynmar Earth Quake: మయన్మార్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..భారత్ 15 టన్నుల సహాయ సామాగ్రి