Telangana: లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ!
తెలంగాణకి వర్షసూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని గ్రేటర్ సిబ్బందిని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు.