హైదరాబాద్ లో మళ్లీ కూల్చివేతలు.. ఆ ఏరియాల్లో హైటెన్షన్!

హైదరాబాద్ లో అధికారులు మళ్లీ కూల్చివేతలు మొదలు పెట్టారు. మైలార్‌దేవ్‌పల్లిలోని లక్ష్మిగూడాలో జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్ పాత్ లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఆయా ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

New Update

హైదరాబాద్‌లో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మైలార్‌దేవ్‌పల్లిలోని లక్ష్మిగూడాలో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేస్తున్నారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. లక్ష్మిగూడా నుంచి వాంబే కాలనీ వరకు అక్రమంగా చేసిన నిర్మాణాలను తొలగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

అయితే.. కూల్చివేతల సందర్భంగా ఎలాంటి వివాదాలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే.. అధికారులు పెద్దలను వదిలేసి తమ లాంటి చిరుజీవులను ఇబ్బంది పెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జులై తర్వాత చేపట్టిన నిర్మాణాలనే కూలుస్తాం..

ఇదిలా ఉంటే.. కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలు కూల్చివేయక తప్పదన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు