HYDRA: హైడ్రాపై అసలేం జరుగుతోంది?

భవన నిర్మాణాలకు హైడ్రా ఎలాంటి అనుమతులు ఇవ్వదని బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడం చర్చనీయాంశమైంది. హైడ్రాపై ఎలాంటి భయం అక్కర్లేదని ఆయన చెప్పారు. GHMC, టౌట్ ప్లానింగ్ విభాగాలు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే లోన్లు ఇస్తాయన్నారు.

New Update
Hydra bhatti vikramarka

చెరువులు, నీటి వనరులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సంస్థ హైడ్రా. మొదట్లో ఈ హైడ్రా కూల్చివేతలకు సోషల్ మీడియాలో మంచి మద్దతు లభించింది. హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌ నెట్టింట హీరోగా మారిపోయారు. రఘునందన్ రావు లాంటి బీజేపీ నేతలు సైతం సపోర్ట్ ప్రకటించారు. ప్రభుత్వం సైతం హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు హైడ్రాను ప్రశంసలతో ముంచెత్తారు. హైదరాబాద్‌ భవిష్యత్‌ తో పాటు ప్రకృతిని కాపాడుకునేందుకే హైడ్రాను తీసుకువచ్చామన్నారు. కేరళ పరిస్థితి హైదరాబాద్ కు రావొద్దంటే హైడ్రా ఉండాల్సిందేనన్నారు. అయితే.. పేదల ఇళ్ల నిర్మాణాలు కూల్చివేతలు, ఏడుపులు, ఆందోళనలతో హైడ్రా అంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి ఏర్పడింది.
ఇది కూడా చదవండి: Hydra Team: బెంగళూరులో హైడ్రా బృందం పర్యటన

ముఖ్యంగా మూసీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అధికారులు చేపట్టిన సర్వే హైడ్రాకు సంబంధం లేకపోయినా.. ఆ సంస్థకు చెడ్డపేరు తీసుకువచ్చింది. హైడ్రాతో రియల్ ఎస్టేట్ కుదేలైందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇంకా.. రిజిస్ట్రేషన్లు తగ్గి ప్రభుత్వ ఆదాయం పడిపోయిందన్న వాదనలు సైతం వినిపించాయి. కాంగ్రెస్ పార్టీలోనూ హైడ్రాకు వ్యతిరేకంగా మధుయాష్కి లాంటి వారు మొదలు పెట్టారు. ఈ క్రమంలో హైడ్రా యాక్టివిటీస్ కూడా తగ్గిపోతూ వచ్చాయి. మరో మూడు నెలల పాటు హైదరాబాద్ లోని చెరువులు ఇతర నీటి వరదలపై సమగ్ర సర్వే చేసిన తర్వాత మళ్లీ కార్యాచరణలోకి దిగుతామని హైడ్రా అధికారులు చెబుతున్నారు. 
ఇది కూడా చదవండి: HYDRA: మళ్లీ దూకుడు పెంచిన హైడ్రా.. నెక్ట్స్ టార్గెట్ ఆ ఏరియానే!

ప్రభుత్వం నష్ట నివారణకు దిగిందా..?

అయితే.. హైడ్రాకు సంబంధించి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నిన్న బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు. హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. హైడ్రా ఎలాంటి అనుమతులు ఇవ్వదన్నారు. హైడ్రా కారణంగా నిర్మాణాలకు అనుమతులు రావన్న ఆందోళన బ్యాంకర్లకు అవసరం లేదని వివరించారు. జీహెచ్‌ఎంసీ, టౌన్‌ ప్లానింగ్‌ తదితర ప్రభుత్వ ప్రత్యేక విభాగాలు నిర్మాణాలకు సంబంధించి అన్ని అంశాలను పరిశీలించి పర్మిషన్లు ఇస్తాయన్నారు. ఎలాంటి భయం లేకుండా నిర్మాణాలకు లోన్లు ఇవ్వాలని సూచించారు. దీంతో హైడ్రా పవర్ తగ్గుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో హైడ్రాకు సంబంధించి నిర్మాణ అనుమతుల కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లాంటిది తీసుకు వస్తారన్న ప్రచారం జరిగింది. హైడ్రా చీఫ్ రంగనాథ్ సైతం ఈ విషయాన్ని అనేక సార్లు ప్రస్తావించారు. అయితే.. ఇప్పుడు హైడ్రా భవన నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి అనుమతి ఇవ్వదని డిప్యూటీ సీఎం భట్టి చెప్పడంతో కొత్త చర్చ మొదలైంది.    

ఇది కూడా చదవండి: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్నాయని ఇప్పుడు హైడ్రా చెబుతున్న అనేక భవనాలకు బ్యాంకులు లోన్లు ఇచ్చాయి. ఇందులో కొన్నింటిని హైడ్రా కూల్చివేసింది కూడా. మూసీ పరివాహక ప్రాంతంలోని అనేక భవనాలను జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ లాంటి ప్రత్యేక విభాగాలు పర్మిషన్లు ఇచ్చాయి. దీంతో బ్యాంకులు లోన్లు ఇచ్చాయి. ఇప్పుడు ఆ లోన్లను తాము ఎలా తీర్చాలని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి భవనాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో పర్మిషన్లు ఇచ్చే సమయంలోనే ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను తనిఖీ చేసి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ముందు పర్మిషన్ ఇచ్చి తర్వాత ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంటూ భయపెట్టడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అవసరం అయితే ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలన్న డిమాండ్ వినిపిస్తోంది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు