ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన హమాస్.. 20 సూత్రాల ప్రణాళికకు అంగీకారం
గాజా యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ విధించిన డెడ్లైన్ ప్రకారం.. ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది.