Gaza Peace: గాజా శాంతి ఒప్పందంలో మొదటి దశ పూర్తి..దీని తరువాత ఏం జరగబోతోంది?

గాజా శాంతి ప్రణాళికలో మొదటి దశ పూర్తయింది. రెండు వైపులా బందీలు విడుదల అయ్యారు. గాజాకు పాలస్తీనీయులు తిరిగి వస్తున్నారు. ఇంత వరకు బావుంది. ఇప్పుడు దీని తరువాత ఏంటి ? రెండో దశకు హమాస్ అంగీకరిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

New Update
peace plan

గాజా శాంతి ప్రణాళికలో మొదటి దశ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. బందీలు అందరినీ హమాస్ పూర్తిగా విడిచిపెట్టింది. అలాగే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న పాలస్తీనా ఖైదీలు కూడా విడుదల అయ్యారు. ట్రంప్ సమక్షంలో నిన్న ఇది జరిగింది. ఇజ్రాయెల్ సెనేట్ లో ట్రంప్ కు స్టాండింగ్ ఒవేషన్ కూడా దక్కింది. ముస్లిం దేశాలతో పాటూ ప్రపంచం అంతా అమెరికా అధ్యక్షుడిని పొగడ్తల్లో ముంచెత్తింది. ఇంత వరకు అంతా సవ్యంగా జరిగింది. అన్నీ అనుకున్నట్టే అయ్యాయి. ట్రంప్ మాటకు ఇటు ఇజ్రాయెల్, అటు హమాస్ కూడా విలువనిచ్చి ఆయన ప్రణాళికకు అంగీకారం తెలిపాయి. అయితే ఇది మొదట దశ మాత్రమే. 

దీని తరువాత ఏంటి?

ప్రస్తుతం జరిగింది అంతా మొదటి దశకు సంబంధించినదే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపొందించిన ప్రణాళికలో మరో దశ ఇంకా మిగిలే ఉంది. గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలు ఉపసంహరణ, హమాస్ ఆయుధాల నిరాయుధీకరణ లాంటి అంశాలపై ఇంకా ఇరు వర్గాలు అంగీకారం తెలపాలి. ప్రస్తుతం మొదటి దశ పూర్తి అయిన నేపథ్యంలో తదుపరి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఎన్ని రోజుల్లో ఉపసంహరించుకుంటుంది అనే ఇంకా అస్పష్టంగానే ఉంది. అలాగే ఆయుధాల నిరాయుధీకరణపై కూడా హమాస్ అభ్యంతరాలు లెవనెత్తుతోంది. అది ఎప్పటికీ జరగదని తెగేసి చెబుతోంది. మూడు రోజుల క్రితం హమాస్ అధికారి ఒకరు ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. 

ట్రంప్ రూపొందించిన ప్రణాళికలో తమకు అభ్యంతరాలున్నాయని హమాస్ సీనియర్ నాయకుడు చెబుతున్నారు. మామాస్ నాయకులు గాజా స్ట్రిప్ ను విడిచి పెట్టాలనడం సరైనది కాదని వారు అంటున్నారు. పాలస్తీనియన్లు హమాస్ సభ్యులైనా కాకపోయినా కూడా వారిని వారి దేశం నుంచి బహిష్కరించడం అన్యాయమని ఆరోపిస్తున్నారు. దీనికి ఎంత మాత్రం తాము ఒప్పుకునేది లేదని..తదుపరి చర్చలకు రామని హమాస్ రాజకీయ బ్యూరో సభ్యుడు హోసం బద్రన్ తెగేసి చెప్పారు. తదుపరి దశ చర్చలు కష్టంగా ఉంటాయని తాను భావిస్తున్నానని, ఇందులో "చాలా సంక్లిష్టతలు , ఇబ్బందులు ఉన్నాయి" అని బద్రన్ అన్నారు. అంతకు ముందు మహాస్ నిరాయుధీకరణ అనే ప్రశ్నకు తావు లేదని మరో హమాస్ అధికారి చెప్పారు. ఆయుధాల అప్పగింత అనేది అసలు చర్చనీయాంశం, చర్చించదగినది కాదని అన్నారు. 

Advertisment
తాజా కథనాలు