Rajastan: వంద మందిని రేప్ చేసిన నిందితులకు యావజ్జీవ జైలు శిక్ష
రాజస్థాన్‌లోని అజ్మైర్లో వంద మంది అమ్మాయిలను రేప్ చేసిన నిందితులకు ఎట్టకేలకు శిక్ష పడింది. 1992లో వంద మంది కాలేజీ అమ్మాయిలను గ్యాంగ్ రేప్ చేసిన 18 మంది నిందితుల్లో ఆరుగురికి అజ్మైర్ ప్రత్యేక కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. దాంతో పాటూ 5 లక్షల జరిమానా కూడా విధించింది.
Uttarakhand : దారుణం.. ఆర్టీసీ బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మరో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్సులో టీనేజ్ బాలికపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. ఘటన తర్వాత ఒంటరిగా ఉన్న బాలికను చూసిన స్థానికులు శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు.
Telangana: బాలికపై గ్యాంగ్ రేప్.. 10 మంది అరెస్టు
హైదరాబాద్‌లోని నేరేడ్మెట్లో గ్యాంగ్‌రేప్ కేసులో కీలక సూత్రధారులైన నరేష్, విజయ్‌లతో సహా.. మరో 8 మందిని అరెస్టు చేశారు. జూన్ 22న కాచిగూడ నుంచి 12 ఏళ్ల బాలికను కొందరు నిందితులు కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Woman Raped : భారత పౌరులు మంచివాళ్లు : స్పెయిన్ గ్యాంగ్‌రేప్ బాధితురాలు
భారత్‌లో పర్యటనకు వచ్చిన ఓ స్పెయిన్ మహిళపై ఝార్ఖండ్‌లో సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆమె పర్యటన ముగియడంతో నేపాల్‌కు వెళ్తుండగా.. భారత పౌరులు మంచివాళ్లని.. నన్ను చాలా బాగా చూసుకున్నారని అన్నారు. నేరస్థులను మాత్రమే నిందించానని పేర్కొన్నారు.
National: స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం.. సోషల్ మీడియాలో భర్త ఆవేదన!
భారతదేశాన్నిచూడ్డానికి వచ్చిన స్పానిష్ మహిళ అత్యాచారానికి గురవ్వడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 10 మంది వ్యక్తులు..అతి దారుణంగా ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి మహిళ భర్త థ్రెడ్ లో వీడియోను పోస్ట్ చేశారు.
Crime : లాడ్జికి వెళ్లిన దంపతులపై దారుణం.. భార్యపై గ్యాంగ్ రేప్
కర్నాటకలో మరో గ్యాంగ్ రేప్ సంఘటన కలకలం రేపింది. భర్తతో కలిసి లాడ్జికి వెళ్లిన మహిళపై ఏడుగురు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేయగా.. పరారిలో ఉన్న నలుగురికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Delhi: ఢిల్లీలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నలుగురు కలిసి ఘోరం
ఢిల్లీలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. చెత్త ఏరుకునే 12ఏళ్ల బాలికపై సదన్ బజార్లో ఓ టీ స్టాల్ యజమాని, అందులో పనిచేసే మరో ముగ్గురు మైనర్ బాలురు లైంగికదాడికి పాల్పడ్డారు. జనవరి 1న ఈ దారుణం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Crime : పండగపూట దారుణం.. ఏపీలో బాలికపై గ్యాంగ్ రేప్
ఏపీ విశాఖపట్నంలో 17 ఏళ్ల బాలికపై వరుస గ్యాంగ్ రేపుల సంఘటన కొత్త సంత్సరం రోజే కలకలం రేపింది. ప్రియుడు పార్టీ పేరుతో నమ్మించి లాడ్డీకి తీసుకెళ్లి అత్యాచారం చేయడంతోపాటు తన స్నేహితులతోనూ లైంగిక దాడి చేయించి పరారయ్యాడు. నిందితులకోసం పోలీసులు గాలిస్తున్నారు.