TG News: హైదరాబాద్‌లో దారుణం.. హైటెక్‌సిటీ పక్కనే గ్యాంగ్ రేప్ హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ పక్కనే ఓ మహిళపై ముగ్గురు యువకుల అత్యాచారం చేశారు. ఓ భవనంలో పని ఉందని పిలిచి ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలు. ముగ్గురు నిందితుల్లో ఒకర్ని పట్టుకున్నారు పోలీసులు. By Vijaya Nimma 05 Nov 2024 in తెలంగాణ క్రైం New Update Hyderabad షేర్ చేయండి Hyderabad: తెలంగాణలో మహిళలపై లైంగిక దాడుల కేసులు రోజురోజూకు పెరిగిపోతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం, పోలీసులు ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి మరో ఘటన హైదరాబాద్‌లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ హైటెక్‌సిటీ పక్కనే ఓ మహిళ గ్యాంగ్ రేప్‌కి గురైంది. ముగ్గురు యువకులు మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. బట్టలు ఉతికే పని ఉందని మాయ మాటలు చెప్పి యువకులు తీసుకెళ్లారు. హైటెక్ సిటీ క్రాస్ రోడ్ దగ్గర ఓ భవనంలో పని ముగించుకుని వెళ్తున్న మహిళను గదిలోకి తీసుకెళ్లి మృగాలుగా యవకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. నోట్లో బట్టలు కుక్కి.. కొండాపూర్‌లో ఓ మహిళ పనికి వెళ్ళింది. రోజువారిగా ఇళ్లలో పనిమనిషిగా చేస్తున్న ఆమె సోమవారం రాత్రి పని ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో ముగ్గురు యువకులు వచ్చి రూమ్‌లో బట్టలు ఉతకాలని చెప్పి రాత్రి సమయంలో తీసుకెళ్లారు. అనంతరం ఆమెను రూమ్‌లో బంధించి, నోట్లో బట్టలు కుక్కి తీవ్రంగా గాయపరచటమే కాకుండా.. అత్యాచారం చేశారు. ఇది కూడా చదవండి: చూసేందుకు చిన్న చేప..సౌండ్ మాత్రం సాలిడ్‌గా ఉంటుంది అక్కడ నుంచి తప్పించుకున్న బాధితురాలు బయటకు పరుగులు తీసింది. అనంతరం మధురానగర్ పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు ఘటనపై స్పందించిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తుండగా.. ఒకరిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు మధురానగర్ పోలీసులు తెలిపారు. మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ ఇద్దరి నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: గ్యాస్ మాత్రలతో మరిన్ని రోగాలు ఖాయమా? ఇది కూడా చదవండి: పాలు లేకుండానే వెన్న తయారు చేస్తున్న కంపెనీ #gang-rape మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి