Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో షాక్.. ఇప్పుడెలా..! ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అక్టోబర్ 29 నుంచి బుకింగ్ మొదలుకానుంది. ఈ గ్యాస్ బుకింగ్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారుల తెల్ల రేషన్‌కార్డుల సమాచారం ఉంటే కానీ బుకింగ్ వీలుకాని పరిస్థితి ఏర్పడింది. దీనిపై అధికారుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. By Seetha Ram 27 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి సందర్భంగా దీపం పథకం ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించనుంది. అక్టోబర్ 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. ఇది కూడా చదవండి: మావోయిస్టులపై ఆఖరి ఆపరేషన్! అక్టోబర్ 29 నుంచి గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఈ లోపు అక్టోబర్ 29 నుంచే గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ మొదలవుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇందులో భాంగగా ఈ పథకానికి అర్హులు ఎవరు అనే దానిపై వివరాలు సైతం వెల్లడించారు. ఈ పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు. ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బస్సు యజమానులుగా.. భట్టీ కీలక వ్యాఖ్యలు మూడు విడతలుగా కాగా ఈ మూడు సిలిండర్లు ఏడాదిలో మూడు విడతలుగా ఇవ్వనున్నారు. అక్టోబర్ 31 నుంచి మార్చి నెలాఖరులోగా ఒకటి. ఏప్రిల్ 1, 2025 నుంచి జులై వరకు మరొకటి. జులై నుంచి నవంబర్ వరకు మూడో సిలిండర్ ఉచితంగా ఇవ్వనున్నారు. అయితే ఈ పథకం అమల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. 1967 ట్రోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇది కూడా చదవండి: పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా? తెల్ల రేషన్‌కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి ఇక ఉచిత గ్యాస్ బుకింగ్‌కు మరొక్క రోజే సమయం ఉంటుండగా.. ఈలోపు ఓ సమస్య అధికారులను ఇబ్బంది పెడుతోంది. ఎందుకంటే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి తెల్ల రేషన్‌కార్డు, ఆధార్ కార్డుదారులను అర్హులుగా నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్‌ను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేస్తే.. ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ద్వారాబుకింగ్ జరుగుతోంది. ఇది కూడా చదవండి: Iran సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా కాబట్టి గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారుల ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఉంటున్నాయి. కానీ తెల్ల రేషన్‌కార్డుల సమాచారం ఉండదు. అలా సమాచారం లేకపోతే ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యపడదు. అంతేకాకుండా సబ్సిడీ కూడా రావాలంటే రేషన్‌కార్డు వివరాలు కూడా ఉండాలి. అందువల్ల ఇప్పుడు పరిస్థితి ఏంటి అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. రేపటికి (అక్టోబర్ 28) నాటికి పూర్తి విధి విధానాలు వస్తాయని తెలుస్తోంది. #ap-cm-chandrababu #free-gas-cylinder #andhra-padesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి