CM Chandra Babu: నేడు కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం

ఏపీలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఎన్నికల హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నారు.కాగా గత నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ మొదలయ్యాయి.

New Update
AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు!

CM Chandra Babu: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేసేందుకు సిద్ధమైంది చంద్రబాబు సర్కార్. సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన పథకాన్ని ఈరోజు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం(D) ఈదుపురంలో చంద్రబాబు ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని షురూ చేస్తారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు(D) ఐఎస్ జగన్నాథపురంలో లబ్ధిదారులకు సిలిండర్లను పంపిణీ చేయనున్నారు. కాగా గత నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ మొదలయ్యా యి. పూర్తి మొత్తం ఇచ్చి సిలిండరు తీసుకుంటే 48 గంటల్లో సబ్సిడీని ప్రభుత్వం జమ చేయనుంది.

Also Read: తెలంగాణ మందుబాబులకు బ్యాడ్ న్యూస్‌..భారీగా ధరల పెంపు!

ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి...

ఇది కూడా చదవండి:రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే!

మొదటి గ్యాస్ సిలిండర్ అక్టోబర్ 31 నుండి మార్చి 31 లోగా బుక్ చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 48 గంటల్లోగా ఇంటికి గ్యాస్ సిలిండర్ అందేలా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మొత్తం లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తామన్నారు. ఈ పథకం పొందాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుండి జులై 31 లోగా రెండో సిలిండర్ బుక చేసుకునేలా అవకాశం కల్పించినట్లు చెప్పారు. 

Also Read: వాట్సాప్‌లో సరికొత్త కొత్త చాట్ ఫీచర్!

డిసెంబర్ 1 నుండి మార్చి 31 లోగా 3 వ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని అన్నారు. ఏడాదికి దాదాపు రూ.2,684.75 కోట్లు ఈ పథకానికి కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులూ ఉన్న ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారని అన్నారు. కాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం  అని అన్నారు.

Also Read:బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Advertisment
తాజా కథనాలు