Floods: భయంకరమైన వరదలు.. నలుగురు మృతి
జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భయంకరమైన వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డోడా జిల్లాలో క్లౌడ్‌బరస్ట్ వల్ల నలుగురు మృతి చెందడం కలకలం రేపింది. కఠువా, కిశ్త్‌వాడ్‌లో కూడా వరదలు సంభవించాయి.

రాజస్థాన్‌లో గత 2రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కోట, బుండి, సవాయి మాధోపూర్, టోంక్ వంటి అనేక జిల్లాల్లో వరద పరిస్థితి నెలకొంది. వరదల కారణంగా ఇద్దరు మహిళలు మృతి చెందగా, వందలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రాజస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు చారిత్రక కట్టడాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. జైపూర్ నగరంలోని ప్రఖ్యాత అమెర్ ఫోర్ట్ వద్ద 200 అడుగుల పొడవైన గోడ కూలిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఉత్తరాఖండ్ లో మరోసారి కుంభవృష్టి కురిసింది. దీంతో మెరుపు వరదలు చమోలీ జిల్లా మెరుపు వరదల్లో మునిగిపోయింది. సగ్వారా గ్రామంలో ఒక యువతి చనిపోగా..పలువురు గల్లంతయ్యారు.